Krishnamraju Statement: సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు( senior journalist Krishnam Raju) అప్రూవర్ గా మారనున్నారా? విచారణలో ఆయన కీలక వాంగ్మూలం ఇచ్చారా? తెర వెనుక జరిగింది ఏమిటి అన్నది బయట పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత మూడు రోజులుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కృష్ణంరాజు విచారణ జరుగుతోంది. అయితే తొలి రోజు తనకు ఏం తెలియదు.. సంబంధం లేదు అని చెప్పుకొచ్చిన కృష్ణంరాజు.. పోలీసులు గత రెండు రోజులుగా గట్టిగా ప్రశ్నించేసరికి కీలక అంశాలు బయటపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట సాక్షి ఛానల్ లో అమరావతి రాజధానిపై జరిగిన డిబేట్లో కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని.. వేశ్యల రాజధాని అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అటు తరువాత కార్యక్రమ నిర్వాహకుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు జరిగింది. అటు తరువాత కృష్ణంరాజును అరెస్టు చేశారు. కొమ్మినేని విషయంలో కండిషన్ బెయిల్ దక్కింది. కానీ కృష్ణంరాజు విషయంలో పట్టు బిగుస్తోంది. దీంతో ఆయన అప్రూవర్ గా మారిపోయేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.
స్వచ్ఛందంగా ముందుకు
ఈ కేసులో ఏ 1 గా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఉన్నారు. కొద్ది రోజులు కిందట ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తుండడంతో జరిగింది చెప్పేస్తా. అమరావతి అక్క చెల్లెమ్మలకు క్షమాపణలు చెబుతా. ఆ మేరకు వీడియో కూడా విడుదల చేస్తా. నన్ను అప్రూవర్ గా మారనివ్వండి. ఆ మేరకు అవకాశం ఇవ్వండి అని కృష్ణంరాజు తుళ్లూరు డిఎస్పి మురళీకృష్ణను వేడుకున్నట్లు సమాచారం. తొలి రెండు రోజులు పెద్దగా సహకరించలేదు కృష్ణంరాజు. మూడో రోజు ఆదివారం జరిగిన విచారణలో మాత్రం దాదాపు అసలు విషయాలను చెప్పారు. తనకు అంతగా గుర్తింపు లేదు అని.. అప్పట్లో తాను ఓ పత్రికలో పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశానని.. ఉద్యోగ పరమైన ఇబ్బందులు పెట్టారని.. అప్పటినుంచి చంద్రబాబుకు యాంటీ అయ్యానని.. వ్యతిరేకంగా వార్తలు రాసేవాడినని.. దానిని గుర్తించిన సాక్షి యాజమాన్యం అనుకూలంగా మార్చుకుందని విచారణలో చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. నా బలహీనతను గుర్తించి సాక్షి మీడియా పావుగా వాడుకుందని పోలీసుల ఎదుట కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారట. తనకు అవకాశం ఇస్తే సాక్షి నన్ను ఎలా వాడుతుందో అన్నింటినీ బయట పెడతానని కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు సాక్షి కొంత మూడి సరుకు అందించిందని.. దాని ఆధారంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నారు.
Also Read: Krishnamraju : కేవలం ఒక్క హీరోయిన్ తోనే 70 సినిమాలు..కృష్ణంరాజు కి ఆమె అంటే అంత ఇష్టం ఎందుకు?
ప్రత్యేక వీడియో?
అయితే పరిస్థితులు చూస్తుంటే కృష్ణంరాజు ఈ కేసు విషయంలో తెరవెనుక జరిగిన దానిపై ఒక వీడియో( video) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే సాక్షి మీడియా చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. ఇప్పటికే ఏపీ హైకోర్టులో సాక్షి యాజమాన్యంపై తదుపరి చర్యలు చేపట్ట వద్దంటూ స్టే ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఇప్పుడు కానీ కృష్ణంరాజు అప్రూవర్ గా మారితే మాత్రం.. సాక్షి యాజమాన్యంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు దిగడం ఖాయం. మరోవైపు సాక్షి మీడియా ముందస్తు జాగ్రత్తగా.. టీవీ డిబెట్లకు ముందు ఎక్స్ క్లైమేటర్ వేసుకుంది. టీవీ డిబేట్ లలో హాజరయ్యే వారి అభిప్రాయాలతో తమకు పనిలేదని.. అది వారి సొంత భావన అన్నట్టు ప్రకటిస్తోంది. అయితే ఇప్పుడు సాక్షి ఇచ్చిన సమాచారంతోనే తాను అలా మాట్లాడినట్లు జర్నలిస్ట్ కృష్ణంరాజు విచారణలో తెలపడం సంచలనంగా మారుతుంది.