NTR Viral Fight Clip: ప్రస్తుతం స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తూ పాన్ ఇండియాలో మంచి సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న హీరో ఎన్టీఆర్ (NTR)… గత సంవత్సరం దేవర (Devara) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు వార్ (War 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాశిస్తున్న మన తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకడు కావడం విశేషం…రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ఆయనకు పాన్ ఇండియా గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఆయన నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. అందువల్ల అతనికి చాలామంది అభిమానులుగా మారిపోయారు…ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా రాజమౌళితో చేసిన సింహాద్రి (Simhadri) సినిమా అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ సినిమా నుంచి వరుసగా ఆయన అలాంటి సినిమాలనే చేస్తూ రావడం వల్ల ఆయనకు మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే దక్కింది.
Also Read: Jr NTR : నందమూరి ఫ్యామిలీ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకంత కోపం…
కానీ ఆయన చేసిన సినిమాలేవీ కూడా సక్సెస్ లను సాధించలేదు. బి గోపాల్ (B Gopal) దర్శకత్వంలో ఆయన చేసిన నరసింహుడు సినిమా అయితే భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఆ సినిమా ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ రోజే హుస్సేన్ సాగర్ లో దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుతం ఈ సినిమాలోకి ఒక ఫైట్ సీన్ ను సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫైట్ సీన్ ఏంటంటే విలన్ ఒక రాడ్ ను జూనియర్ ఎన్టీఆర్ మీదకి విసిరేయగా ఎన్టీఆర్ ఆ రాడ్ ను పట్టుకోగానే అది ఆటోమేటిగ్గా వంగిపోతుంది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది జనాలు ఆ రాడ్ అలా ఎలా వంగిపోయింది బ్రో అంటూ నవ్వుకుంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ను ట్రోల్ చేస్తునే జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైనా మంత్ర తంత్రాలు వస్తాయా? ఆయన ఆ రాడ్ పట్టుకోగానే అది వంగిపోయింది అంటూ అతని అభిమానులకు కోపాన్ని తెప్పించేలా కామెంట్స్ చేస్తున్నారు…ఇలాంటి సన్నివేశాలను అప్పట్లో దర్శకులు ఎలా చేశారు. అయిన జూనియర్ ఎన్టీఆర్ సైతం దీనికి అభ్యంతరాలను చెప్పలేదా? అంటూ భారత్ ఎత్తిన కామెంట్స్ వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా నరసింహుడు మూవీ దెబ్బకి జూనియర్ ఎన్టీఆర్ 3 సంవత్సరాల వరకు కోలుకోలేదనే చెప్పాలి…