CM Chandrababu : టిడిపి కూటమికి ఈసారి ఎందరో సినీ పెద్దలు మద్దతు తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి బాహటంగానే మద్దతు లభించింది. ఈ క్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఏకంగా పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. టిడిపి కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి కృష్ణంరాజు బిజెపి సీనియర్ నేత. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఒకానొక దశలో బిజెపి హై కమాండ్ ఆయనను గవర్నర్గా ప్రమోట్ చేస్తుందని భావించారు. అయితే ఇంతలోనే ఆయన అకాల మరణం చెందారు. అయితే ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని బలంగా ఆకాంక్షించారు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి. ఈ విషయాన్ని బాహటంగానే చెప్పుకొచ్చారు. అలా అనడమే కాదు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుందని చెప్పుకొచ్చారు.
* ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు
మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తొలి సినిమా మన దేశం విడుదలై 75 ఏళ్లు అవుతోంది. ఈ తరుణంలో విజయవాడలోని పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను నిర్వహించారు. టిడిపి నేత టి డి జనార్ధన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఈ వేడుకలను నిర్వహించింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేసిన ప్రసంగం ఇప్పుడు హైలెట్ అవుతోంది. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు ఆమె. మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి వచ్చేసాడు.. అదే మా చంద్రబాబు అనే డైలాగ్ చెప్పడంతో సభ చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రస్తుతం ఆమె చేసిన ప్రసంగం వీడియో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ తన అఫీషియల్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. టిడిపి శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
* ఆమెకు కీలక పదవి
ఎన్నికల్లో కృష్ణంరాజు కుటుంబం నేరుగా కూటమికి మద్దతు తెలిపింది. అటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సైతం కూటమి పట్ల సానుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు నేరుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. అయితే కృష్ణంరాజు విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉండేవారు. అదే సమయంలో కృష్ణంరాజు సైతం చంద్రబాబు విషయంలో చాలా గౌరవంతో ఉండేవారు. ఇప్పుడు ఆయన భార్య నేరుగా చంద్రబాబును ప్రశంసించడంతో.. మున్ముందు ఆమె సేవలను కూటమి వినియోగించుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
బాహుబలి సినిమా డైలాగ్ చెప్పి, చంద్రబాబు గారి పరిపాలనను ప్రశంసించిన, దివంగత కృష్ణంరాజు గారి సతీమణి, శ్యామలాదేవి గారు #NTRCineVajrotsavam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/jm6tDOQNd5
— Telugu Desam Party (@JaiTDP) December 14, 2024