Homeఆంధ్రప్రదేశ్‌Kotthapeta Rally Accident: టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు.. పరుగులు తీసిన నేతలు.. వైరల్...

Kotthapeta Rally Accident: టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు.. పరుగులు తీసిన నేతలు.. వైరల్ వీడియో

Kotthapeta Rally Accident: ఏపీవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ( Annadata Sukhibava) విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మాదిరిగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడంతో.. నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం చాలా జిల్లాల్లో విజయోత్సవ ర్యాలీలు కొనసాగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సైతం విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా అపశృతి జరిగింది. ఎమ్మెల్యే సత్యానందరావు తో పాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సతీష్ రాజుకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక్కసారిగా నాటు బండి కుప్ప కూలిపోవడంతో నేతలంతా రోడ్డుపై పడ్డారు.

Also Read:  పులివెందులలో రెండో స్థానంలో కాంగ్రెస్.. వైసీపీ లెక్క అదే!

రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు..
తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20వేల రూపాయల నగదును సాగు ప్రోత్సాహం కింద అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిధులు విడుదల చేశారు. పీఎం కిసాన్ 2000 రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవ కింద మరో ఐదు వేలు జతచేస్తూ.. మొత్తం 7000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో రైతులతో సంబరాలు చేయాలని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఎడ్లు బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు జరిపారు.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసిపి.. స్పృహ లేని టిడిపి సోషల్ మీడియా!

బెలూన్ పేలడంతో..
అయితే కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యానందరావు( MLA satyananda Rao ) నేతృత్వంలో అన్నదాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా ఎడ్ల బండ్లను తీసుకొచ్చారు. అందంగా అలంకరించారు. ఎమ్మెల్యే సత్యానందరావు తో పాటు ఇతర టిడిపి నాయకులు ఎడ్ల బండి పై నిల్చుని ప్రసంగించారు. సూపర్ సిక్స్ తో పాటు అన్నదాత సుఖీభవ హిట్ అంటూ వ్యాఖ్యానించిన క్రమంలో ఒక్కసారిగా ఎడ్లు బెదిరాయి. బండికి కట్టిన బెలూన్లు ఒక్కసారిగా పేలడంతో ఎడ్లు ఆందోళనకు గురయ్యాయి. ఒక్కసారిగా పరుగు తీయడంతో బండిపై ఉన్న టిడిపి నేతలు రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సత్యానందరావుకు గాయాలయ్యాయి. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీష్ రాజుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version