Komminei Case Legal Sections : అమరావతి( Amravati ) మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమరావతి మహిళా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. వారి ఫిర్యాదుతో సాక్షి యాజమాన్యంతో పాటు జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కేసు నమోదయింది. ఇందులో కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ వెళ్లి మరి అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రెండు వారాలు పాటు రిమాండ్ కూడా విధించింది. ఈనెల 24 వరకు ఆయన రిమాండ్ కొనసాగనుంది. దీంతో పోలీసులు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇంకోవైపు జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇంతవరకు సాక్షి యాజమాన్యం దీనిపై స్పందించలేదు.
* న్యాయమూర్తి స్పందన..
అయితే కోర్టులో వాదనలు జరిగినప్పుడు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు పై (Kommineni Srinivasa Rao )ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లు నమోదు చేశారు. అయితే వాటిపై ప్రశ్నించారు న్యాయమూర్తులు. అసలు ఆ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని డీఎస్పీని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో పరువు నష్టానికి సంబంధించిన సెక్షన్లు ప్రస్తావించి.. రిమాండ్ రిపోర్టులో ఎందుకు తొలగించారు అని ప్రశ్నించారు. వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కొద్దిరోజుల కిందట సాక్షి మీడియాలో డిబేట్లో అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారు అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు తో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : ఏపీ రాజకీయాలు : ఒక వైపే కాదు..రెండో వైపూ బూతే.. బయటపడదంతే?
* చాలా సెక్షన్ల కింద కేసు నమోదు..
అయితే కేసు నమోదు సమయంలో బిఎన్ఎస్ 79, 196 (1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటి యాక్ట్, ఎస్సీ, ఎస్ టి యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. హైదరాబాదులో( Hyderabad) అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. అయితే కొమ్మినేని కి రిమాండ్ విధించడం సరికాదని ఆయన తరుపు లాయర్ వాదించారు. ఆర్నాబ్ గోస్వామి కేసుతో సహా చాలా కేసులను ఉదాహరించారు. అయితే వాటి వివరాలు ఇవ్వాలని కోర్టు కోరగా.. ఆయన సమయం అడిగారు. దీంతో కేసు విచారణను వాయిదా వేశారు.
* వసతులు కోరిన కొమ్మినేని..
మరోవైపు కేసు మళ్లీ విచారణ ప్రారంభం అయింది. అయితే కొమ్మినేని తరపు లాయర్ మహాభారతంలోని విషయాలను చెప్పగా జడ్జి అభ్యంతరం తెలిపారు. కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలన్నారు. వాదనలు విన్న తర్వాత కొమ్మినేనికి రిమాండ్ విధించారు. అయితే జైలులో తనకు కొన్ని వసతులు కావాలని కోర్టును అడిగారు కొమ్మినేని. తనకు 70 ఏళ్లని.. వయసు చూసి అయినా వసతులు కల్పించాలని ఆయన కోరారు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఇస్తారని.. ఒకవేళ కోర్టు నుంచి ఆదేశాలు కావాలంటే పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.