Kodali Nani : కొడాలి నాని( Kodali Nani) .. ఒక ఫైర్ బ్రాండ్. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక ఆయుధంలా ఉండేది. ప్రత్యర్థిని తాకేది. ఆయనను టచ్ చేయాలంటే మిగతా నేతలకు భయం వేసేది. అటువంటి కొడాలి నాని పరిస్థితి తారుమారు అయ్యింది. ఒకే ఒక్క ఓటమి కోలుకోలేని దెబ్బతీసింది. అనారోగ్యం పాలు చేసింది. ఇప్పుడు ఆయనకు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పొలిటికల్ గా ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశం లేదు. అటు రాజకీయంగా కూడా కలిసి రావడం లేదు. ఇప్పటివరకు తనతో కలిసి నడిచిన చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన నేత ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఇటువంటి రాజీనామాలు సహజమే. కానీ కొడాలి నాని కి మాత్రం తీరని లోటు.
Also Read : మరో నెల రోజులు ఆసుపత్రిలోనే.. కొడాలి నాని ఆరోగ్యం పై బిగ్ అప్డేట్!
* వరుసగా నాలుగు సార్లు గెలుపు..
2004 నుంచి 2019 వరకు.. వరుసగా నాలుగుసార్లు గుడివాడ( Gudivada) నియోజకవర్గం నుంచి గెలిచారు కొడాలి నాని. గుడివాడ దివంగత నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. టిడిపి ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అటువంటి నియోజకవర్గంలో 2004లో ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఉన్నా.. నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి చేయడంతో కొడాలి నాని కి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. 2009లో సైతం కొడాలి నాని గుడివాడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. టిడిపి అధికారంలోకి రాకపోవడంతో.. అధినాయకత్వం పై అసంతృప్తితో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కొడాలి నాని. అది మొదలు చంద్రబాబుపై విరుచుకు పడుతూనే ఉన్నారు. చంద్రబాబు సైతం 2014, 2019 ఎన్నికల్లో కొడాలి నాని ఓడించేందుకు బలమైన ప్రయత్నాలు చేశారు. కానీ వర్క్ అవుట్ కాలేదు. అయితే 2024 ఎన్నికల్లో వెనిగండ్ల రాము రూపంలో బలమైన నేత దొరకడంతో.. కొడాలి నానిని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.
* ప్రధాన అనుచరుడి గుడ్ బై..
ప్రస్తుతం గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అంటూ లేదు. కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. కొడాలి నాని( Kodali Nani ) అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న మైనారిటీ నేత ఖాసిం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే కొడాలి నాని తర్వాత గుడివాడలో ఖాసిం అన్నట్టు పరిస్థితి ఉండేది. అలాంటి నాయకుడు ఇప్పుడు కష్టకాలంలో కొడాలి వదిలేయడం చర్చకు దారితీస్తోంది. గుడివాడలో పట్టున్న నేతగా కొడాలి నాని గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి తలకిందులు అయ్యింది. గతంలో ఇదే కొడాలి నాని.. చంద్రబాబుకు తరచూ సవాల్ చేసేవారు. దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరేవారు. ఇప్పుడు అదే గుడివాడ నుంచి దారుణంగా ఓడిపోయారు కొడాలి నాని.
Also Read : కొడాలి నానికి బైపాస్ సర్జరీ…. ఆందోళనలో అభిమానులు!
* పార్టీ మనుగడ కష్టమని..
గుడివాడలో పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్న కీలక నేతలంతా గుడ్ బై చెబుతున్నారు. అందులో భాగంగానే ఖాసిం( Kasim) గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం కొడాలి నాని వ్యవహార శైలి కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని లో చాలా మార్పు వచ్చిందని ఆయన నిందించారు. ఎన్నికల అనంతరం పార్టీని వదిలేసారని విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడిప్పుడే అనారోగ్య పరిస్థితుల నుంచి కోరుకుంటున్నారు కొడాలి నాని. మరి కొద్ది నెలల్లో ఆయన యాక్టివ్ అవుతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.