Homeఆంధ్రప్రదేశ్‌Kiraak RP Comments On Roja: రోజాపై మళ్లీ రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ.. వైరల్ వీడియో

Kiraak RP Comments On Roja: రోజాపై మళ్లీ రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ.. వైరల్ వీడియో

Kiraak RP Comments On Roja:  మాజీ మంత్రి రోజాపై( Roja) కమెడియన్ కిరాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెన్నుపోటు దినం సందర్భంగా మాజీ మంత్రి రోజా రెండు చెవుల్లో పువ్వులు పెట్టుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా కూటమి ఏడాది పాలనపై ఆమె అనేక రకాల విమర్శలు చేశారు. దీనిపై తాజాగా స్పందించారు కమెడియన్ కిరాక్ ఆర్పి. కౌంటర్ ఇచ్చారు. గత ఏడాది కూటమి పాలనలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని గుర్తు చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని రోజాను హెచ్చరించారు. అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే రోజా, కిరాక్ ఆర్పీ మధ్య గత కొద్ది రోజులుగా రభస జరుగుతూనే ఉంది. అయితే రోజాకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు కిరాక్ ఆర్పి.

* గత ఎన్నికలకు ముందు నుంచి..
గత ఎన్నికలకు ముందు కూడా జబర్దస్త్ నటులు( Jabardasth actors ) రోజా తీరుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. అయితే సుదీర్ఘకాలం వారి మధ్య బంధం ఉండేది. జబర్దస్త్ జడ్జిగా రోజా ఉండేవారు. అక్కడే సహజంగా జనసేన నేత నాగబాబు కొనసాగే వారు. కానీ జబర్దస్త్ నటులు అంత జనసేన టిడిపి వైపు మొగ్గు చూపారు. అటు మంత్రిగా మారిన తర్వాత రోజా సైతం జబర్దస్త్ కు దూరమయ్యారు. అయితే ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వారి మధ్య రగడ జరుగుతోంది. ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ నటులు అప్పట్లో ప్రచారం చేశారు. దీనిపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా చిన్నచిన్న ఆర్టిస్టులు అని.. డబ్బులు కోసం పని చేసే వారని.. మెగా ఫ్యామిలీకి ఎదురు వెళితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని.. భయంతోనే ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశారు. దీనిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు కిరాక్ ఆర్పి. మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అని పిలుస్తాం. గౌరవించకపోతే రోజా అంటాం. వాళ్లంతా చిన్న చిన్న ఆర్టిస్టులంటా. ఈవిడ ఏమైనా 15 నేషనల్ అవార్డులు, పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి అంటూ అప్పట్లో రెచ్చిపోయారు ఆర్పి.

* విమర్శలతో తిప్పికొడుతూ..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు కిరాక్ ఆర్పి( kiraak RP) . ఇటీవల సీమ రాజా తో కలిసి యూట్యూబ్ ఛానల్ లో హల్చల్ చేస్తున్నారు. కిరాక్ ఆర్పి టిడిపికి బలమైన మద్దతు దారు. అటు జనసేన విషయంలో కూడా సానుకూలంగా ఉంటారు. తాజాగా వెన్నుపోటు దినం రోజున మాజీ మంత్రి రోజా చెవుల్లో రెండు పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రంగంలోకి దిగారు కిరాక్ ఆర్పి. ఏడాదికాలంగా అమలవుతున్న పింఛన్లు, అన్న క్యాంటీన్లు, మూడు గ్యాస్ సిలిండర్లు, అభివృద్ధి పనులు వివరిస్తూ రోజాను ఇచ్చి పడేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కిరాక్ ఆర్పి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version