Bheemla Nayak KIA Holiday : భీమ్లానాయక్ మూవీ మేనియా దెబ్బకు ఆ దిగ్గజ కంపెనీ కూడా దిగివచ్చింది. ఏకంగా ఉద్యోగుల మూకుమ్ముడిగా సెలవు కోరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించింది. పవర్ స్టార్ మూవీ కోసం ఉద్యోగులంతా సెలవు కోరడం వైరల్ గా మారింది. వకీల్ సాబ్ తర్వాత భీమ్లానాయక్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో పవన్ నటనను ట్రైలర్ చూసి ఎలాగైనా మూవీ చూడాలని ఆశపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా భీమ్లానాయక్ సినిమా విడుదలైంది. పవన్ తోపాటు రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. మళయాల సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పమ్ కోషియం’ సినిమాకు రిమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: Celebrity praises on Bheemla Nayak Movie: “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం
భీమ్లానాయక్ కోసం పవన్ ఫ్యాన్స్, ప్రజలే కాదు.. ఉద్యోగులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా అనంతపురంలోని దక్షిణకొరియాకు సంబంధించిన ప్రముఖ కార్ల కంపెనీ కియా కూడా సెలవు ప్రకటించింది. కియా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు భీమ్లానాయక్ చూసేందుకు మూకుమ్మడిగా సెలవు పెట్టారు.
సినిమా చూసేందుకు సెలవు కావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. ఉద్యోగుల లేఖతో కియా కంపెనీ షాక్ అయ్యింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక చేసేదేం లేక ‘కియా హెచ్ఆర్ విభాగం సెలవు ప్రకటించింది. ఇక శుక్రవారానికి బదులు ఆదివారం విధుల్లోకి రావాలని కండీషన్ పెట్టింది. దీంతో సినిమా చూసిన ఆనందం ఓవైపు ఉన్నా.. దానికోసం మరోరోజు పనిచేయాల్సి వచ్చిందని ఉద్యోగులు హతాషులయ్యారు.
Also Read: Bheemla Nayak Collections: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్
Recommended Video:
[…] Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తెలుపు రంగు కుర్తాలో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ తళుక్కున మెరిసింది. మొత్తానికి అందమైన డ్రెస్ లో అందాల బ్యూటీ బాగా అలరిస్తోంది. ఇక ఆ డ్రెస్సు రూపొందించిన వారికి థ్యాంక్స్ చెప్పింది. […]
[…] Love Marriages in Tollywood Star Heroes: ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి సంతానం కోసం ఎదురు చూస్తారు. పెండ్లి అయిందంటే కచ్చితంగా వారికి పిల్లలు ఎందరు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. కానీ చాలామందికి పిల్లలు లేక నానా ఇబ్బందులు పడుతుండటం మనం చూస్తున్నాం. అయితే ఈ బాధ కేవలం సామాన్య జనం మాత్రమే కాక.. సినీ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెండ్లి చేసుకున్న చాలామంది సెలబ్రిటీలకు సంతాన భాగ్యం కలగక బాధ పడ్డారు. […]
[…] Pawan Fans Serious on Posani Comments: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సినీ ప్రముఖులు ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ పై అకారణంగా నిందలు వేస్తే భూమిలో 100 అడుగుల లోతుకు పాతుకుపోతారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ రోజు తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం పోసాని మాట్లాడుతూ మేం సినిమాలోనే హీరోలమని, రియల్ హీరో సీఎం వైఎస్ జగన్ అని పోసాని చెప్పుకొచ్చాడు. […]
[…] Also Read: భీమ్లానాయక్ దెబ్బకు ఏకంగా సెలవు ప్రక… […]