Tollywood Couples Who Don’t Have Kids: ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి సంతానం కోసం ఎదురు చూస్తారు. పెండ్లి అయిందంటే కచ్చితంగా వారికి పిల్లలు ఎందరు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. కానీ చాలామందికి పిల్లలు లేక నానా ఇబ్బందులు పడుతుండటం మనం చూస్తున్నాం. అయితే ఈ బాధ కేవలం సామాన్య జనం మాత్రమే కాక.. సినీ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెండ్లి చేసుకున్న చాలామంది సెలబ్రిటీలకు సంతాన భాగ్యం కలగక బాధ పడ్డారు.

Krishna – Vijaya Nirmala
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలను ప్రేమించి రెండో పెండ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య ఇందిరకు మాత్రం అప్పటికే పిల్లలు ఉన్నారు. కానీ రెండో భార్య విజయ నిర్మలను పెండ్లి చేసుకున్నా కూడా వారికి పిల్లలు కలగలేదు. అయితే అప్పటికే విజయకు సీనియర్ నరేశ్ మొదటి భర్త ద్వారా జన్మించాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు దంపతులు కూడా చాలా ఏండ్ల వరకు పిల్లలు లేక బాధ పడ్డారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగిన తర్వాత వారికి సంతానం కలిగింది.
Also Read: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

Krishnam Raju
అయితే అప్పటి వరకు వారు ప్రభాస్‌నే తమ బిడ్డగా పెంచారు. ఇండస్ట్రీలో కూడా కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ ఉన్నాడు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు పిల్లలు లేరు. ముఖ్యంగా కమాన్ అబ్రోహీ-మీనా కుమారీ, మధు బాల-కిషోర్ కుమార్, దిలీప్-సైరా లాంటి స్టార్ సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెండ్లి చేసుకున్నా కూడా వారికి సంతానం మోక్షం మాత్రం కలగలేదు.

Madhubala married Kishore Kumar
ఆశబోమ్సలే-ఆర్జీ బర్మన్, అహ్లీ వాలియా-కమల్ తో పాటుగా అనుపమ్ ఖేర్-కిరణ్ ఖేర్, సాధన-ఆర్కే నాయక్ లాంటి సెలబ్రిటీలకు కూడా ఇంకా పిల్లలు కాలేదు. అయితే ఈ జనరేషన్ లో కూడా మంది యువ దంపతులుకు కూడా పిల్లలు లేరు. కాకపోతే వారికి ఇంకా వయసు ఉంది కాబట్టి త్వరలోనే పిల్లలు పుడతారేమో అని అందరూ ఆశిస్తున్నారు.
Also Read: భీమ్లానాయక్ ప్రభావం గట్టిగానే కనిపించింది !