YSR Congress Party : పశ్చిమగోదావరి వైసీపీలో ఏమవుతోంది? మరో బిగ్ షాట్ గుడ్ బై!

పశ్చిమగోదావరి జిల్లాలో వైసిపి ఖాళీ అవుతోంది. జగన్ కు అత్యంత విధేయుడైన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి పార్టీకి కష్టకాలం మొదలైంది. నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు.

Written By: Dharma, Updated On : October 14, 2024 10:32 am

YCP west Godavari District

Follow us on

YSR Congress Party : : వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. క్రియాశీలక నేతలంతా పార్టీకి గుడ్ బై చెబుతుండడంతో క్యాడర్ సైతం ఆందోళనతో ఉంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కానీ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ 50వేల పై మాటే. దీంతో పార్టీకి ఇప్పట్లో భవిష్యత్తు ఉండదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేతగా ఆళ్ల నాని గుర్తింపు పొందారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ సైతం ఆళ్ల నానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాని ఓడిపోయారు. అప్పటినుంచి సైలెంట్ అయ్యారు. వన్ ఫైన్ మార్నింగ్ ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. అక్కడ కొద్ది రోజులకే వైసీపీకి సైతం గుడ్ బై చెప్పారు. అక్కడ నుంచి వైసీపీ నేతలు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మిగతా నాయకులు సైతం పార్టీని వీడేందుకు రకరకాల సాకులు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ సంకేతాలు పంపుతున్నారు.

* పార్టీ మారే ఆలోచనలో జెయింట్ కిల్లర్
ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడేందుకు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో గ్రంధి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో పవన్ పై గెలిచారు గ్రంధి శ్రీనివాస్. మంత్రి పదవి ఇస్తానని జగన్ నమ్మించారు. కానీ ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారు గ్రంధి. ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి బరిలో దిగిన గ్రంధి భారీ ఓట్ల తేడాతో ఓటమి పొందారు. అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అనారోగ్యం కారణంతోనే రావడంలేదని హై కమాండ్ కు చెబుతున్నారు.

* సీఎం చంద్రబాబుకు వరద సాయం
అయితే తాజాగా పరిణామాలు చూస్తే గ్రంధి శ్రీనివాస్ కూటమి పార్టీలవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే చాలామంది టీడీపీలో చేరాలనుకుంటున్న వైసీపీ నేతలు చంద్రబాబుకు కలిసి సాయం అందించారు. ఆ జాబితాలో గ్రంధి సోదరులు కూడా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాని గ్రంధి శ్రీనివాస్.. చంద్రబాబును మాత్రం తన సోదరులతో కలిశారు. కోటి రూపాయల చెక్కు అందించారు. దీంతో అప్పటినుంచి వైసిపి ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అక్కడ టిడిపి ఇన్చార్జి పదవి ఖాళీగా ఉంది. గ్రంధి శ్రీనివాస్ వస్తే ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తామని టిడిపి ఆఫ్రి ఇచ్చినట్లు తెలుస్తోంది.

* ఆ మాజీ మంత్రి సైతం
మరోవైపు తాజా మాజీ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. గత కొద్దిరోజులుగా పార్టీ హై కమాండ్ పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి ఇచ్చి తీసేసారన్న అసంతృప్తి ఆయనలో ఉంది. ఆయన గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం సేకరించిన భూముల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసులపరంగా ఇబ్బందులు వస్తాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీకి దూరం కావడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే గోడ దూకేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి.