Keshineni Nani : అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) దూరమయ్యారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన టిడిపిలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే మరో బాంబు పేల్చారు. తన సోదరుడు చిన్ని అవినీతికి సంబంధించి ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ ఎంపీ నాని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌కు భూము కేటాయించడాన్ని ప్రశంసించారు. తద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించవచ్చని.. ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశం అని ఆహ్వానించారు. చంద్రబాబు దర్శనికతకు ఇది అడ్డం పట్టిందని పేర్కొన్నారు.
Also Read : విప్పింది సగం బట్టలే.. విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్!
* ఆ విషయంలో అభ్యంతరాలు..
అయితే అదే సమయంలో ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్( Ursha cluster Private Limited ) సంస్థకు విశాఖలో 60 ఎకరాల భూమిని కేటాయించడంపై మాత్రం మాజీ ఎంపీ కేశినేని నాని తప్పు పడతారు. సదరు సంస్థకు విశాఖ ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే దీని వెనుక అక్రమాలు ఉన్నాయన్నది మాజీ ఎంపీ నాని ఆరోపణ. దీనిపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయింపు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు నేరుగా లేఖ రాశారు. తన ఫేస్బుక్ అధికారిక అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఉర్సా క్లస్టర్ సంస్థ ఏర్పాటు అయిన కొన్ని వారాలకే భూమిని కేటాయించడం సహేతుకం కాదని అన్నారు. ఈ సమస్త కు ఎలాంటి అనుభవం లేదని.. భారీ ప్రాజెక్టులను అమలు చేయడానికి తగిన నేపథ్యం లేకపోవడాన్ని ప్రస్తావించారు.
* తెర వెనుక చిన్ని
అయితే ఈ ఐటీ సంస్థ వెనుక విజయవాడ ఎంపీ( Vijayawada MP ), తన సోదరుడు కేశినేని చిన్నికి ఎంతగానో ప్రయోజనం ఉందన్నది నాని చేస్తున్న ఆరోపణ. సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ చిన్నికి అత్యంత సన్నిహితుడని.. కాలేజీలో కలిసి చదువుకున్నారని నాని తెలిపారు. 21 సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వాములుగా ఉండేవారని గుర్తు చేశారు. ఆ సంస్థ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందని ఆరోపణలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సంస్థకు భూముల కేటాయింపుల వెనుక కేశినేని చిన్ని హస్తం ఉందని నాని ఆరోపించారు. ఎంపీగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన పలుకుబడి ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. విజయవాడలో ఎన్నెన్నో అక్రమాలతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని ఫోటోను దీనికి జత చేశారు.
* నారా లోకేష్ పై సైతం..
తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని( Nani) దూరం కావడానికి ఎంపీ చిన్ని కారణమన్న విమర్శ ఉంది. యువనేత నారా లోకేష్ ను పట్టుకొని పార్టీలో యాక్టివ్ అయిన చిన్ని.. సులువుగా లోక్‌సభ సీటును కొట్టేసారని నాని తన అనుచరుల వద్ద చెబుతుంటారు. చిన్ని తో పాటు కొంతమంది నేతల తీరుతోనే తాను లోకేష్ కు దూరమయ్యానని విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. అయితే ఇప్పుడు చిన్ని బాహటంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ చిన్ని లోకేష్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఈ విషయంలో కలుగ చేసుకోవాలని సీఎం చంద్రబాబును.. మాజీ ఎంపీ కేసినేని నాని కోరడం సంచలనంగా మారింది.