Keeravani: జగన్ సర్కార్ పై కీరవాణి సంచలన కామెంట్స్ .. పెనుదుమారం

కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా మనసు మమత. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కీరవాణికి ఇచ్చారు.

Written By: Dharma, Updated On : June 28, 2024 10:40 am

Keeravani

Follow us on

Keeravani: వైసిపి ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఇబ్బందులు పడింది. అందుకే సినీ పరిశ్రమ నుంచి ఈసారి వ్యతిరేకత బాహటంగానే కనిపించింది.అసలు రాజకీయాల వైపు చూడని చిరంజీవి సైతం కూటమికి మద్దతు ప్రకటించారంటే ఎంతలా విసిగిపోయారో అర్థం అవుతోంది. ఒక్క చిరంజీవి కాదు దాదాపు సినీ పరిశ్రమ యావత్ జగన్ సర్కారును వ్యతిరేకించింది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవాలని బలంగా కోరుకుంది. పోసాని కృష్ణ మురళి, కమెడియన్ అలీ వంటి ఒకరిద్దరు తప్ప అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో బాహాటంగా వచ్చి మాట్లాడుతున్నారు.రామోజీరావు సమస్మరణ సభలోసంగీత దర్శకుడు కీరవాణి అయితే ఓపెన్ అయ్యారు.ఈ సభకు రాజకీయ,మీడియా, వ్యాపార సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే ఆ వేదికపై రామోజీరావు గురించి కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా మనసు మమత. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కీరవాణికి ఇచ్చారు.అటు తరువాత కీరవాణి తెలుగు సంగీత దర్శకుల్లో ప్రముఖునిగా గుర్తింపు సాధించారు. అదే విషయాన్ని తలుచుకున్నారు కీరవాణి.తనకు అవకాశం ఇచ్చిన రామోజీరావు దేవుడు అని.. అందుకే ఆయన ఫోటో మా ఇంట్లో దేవుడి పటాల వద్ద ఉంటుందని గుర్తు చేశారు. మహోన్నత వ్యక్తిత్వానికి ప్రతీక రామోజీరావు అని కొనియాడారు. రామోజీరావు లాగా ఒక్కరోజు బతికినా చాలని గతంలో ఓ సభలో తాను అన్నానని.. రామోజీరావు లాగా చనిపోవాలని ఈ సభలో అంటున్నానని కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు కీరవాణి. కురుక్షేత్ర మహాసంగ్రామం లో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చేవరకు ఆపారని.. అదే మాదిరిగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధహస్తాల నుంచి బయటపడడం చూసి రామోజీరావు మరణించారని కీరవాణి చేసిన కామెంట్స్ సంచలనం గా మారాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే కీరవాణి వంటి సంగీత దిగ్గజం చేసిన వ్యాఖ్యలు మాత్రం వాటన్నింటికీ మించి ఉన్నాయి. దీన్నిబట్టి వైసీపీ ప్రభుత్వ చర్యలతో సినీ పరిశ్రమ ఎంత రగిలిపోయి ఉంటుందో అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.