https://oktelugu.com/

AP Elections 2024 : కసిగా ఓటేసిన కమ్మలు, కాపులు.. అధికారం లాగేసుకుంటారా?

ఏపీలో ఓట్లు వేసిన కాపు, కమ్మ సామాజికవర్గాల ఓటర్లలో 80 శాతం మంది కూటమి వైపే మొగ్గు చూపినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం 20 శాతం మాత్రమే అధికార వైపీసీకి ఓటు వేసినట్లు భావిస్తున్నారు. దీని ఫలితంగానే టీడీపీ గెలుపుపై ధీమాతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2024 / 01:29 PM IST

    Kammas and Kapu`s who voted for TDP alliance against Reddy community.

    Follow us on

    AP Elections 2024 : ఏపీలో కుల రాజకీయాలు చాలా ఎక్కువ. 2024లో ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని కమ్మ, కాపు సామాజికవర్గాలు ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు వేసినట్లు భావిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పవన్‌ కోసం కాపులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కోసం కమ్మలు కసిగా ఓటు వేసినట్లు అభిప్రాయపడుతున్నారు.

    పవన్‌ కోసం కాపులు..
    ఏపీలో జగన్‌ కాపు సమాజిక వర్గానికి చెందిన పవన్‌ను టార్గెట్‌ చేయడంతో కాపుల్లో రెవల్యూషన్‌ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్‌ తమ ప్రతినిధిగా ఓన్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈసారి కాపులు దేశంతోపాటు విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారని తెలుస్తోంది.

    కమ్మలు కూడా..
    ఇక ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబుకు మధ్య మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల జగన్‌ టీడీపీ అధినేతను జైల్లో పెట్టించారు. దీంతో టీడీపీని కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కమ్మలు భావించారు. రెడ్ల ప్రాభల్యం పెరుగుతుండడంతో ఈసారి కాపాడుకోకపోతే కమ్మల ఉనికే ప్రశ్నార్థకమవుతుందని భావించారు. దీంతో ఈ సామాజికవర్గం ఓటర్లు కూడా భారీగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు.

    80 శాతం కూటమికే..
    ఇక ఏపీలో ఓట్లు వేసిన కాపు, కమ్మ సామాజికవర్గాల ఓటర్లలో 80 శాతం మంది కూటమి వైపే మొగ్గు చూపినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం 20 శాతం మాత్రమే అధికార వైపీసీకి ఓటు వేసినట్లు భావిస్తున్నారు. దీని ఫలితంగానే టీడీపీ గెలుపుపై ధీమాతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.