https://oktelugu.com/

Nagababu: మెగా ఫ్యామిలీ కి అల్లు అర్జున్ కి ఇక సంబంధం లేదా..?వైరలవుతున్న నాగబాబు పోస్ట్…

నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డి లకు అల్లు అర్జున్ కి ఫ్రెండ్ అవ్వడం వల్ల అతని కోసం ప్రచారంలో పాల్గొని ఆయన్ని భారీ మెజారిటీ తో గెలిపించాలంటూ ఆ నియోజికవర్గ ప్రజలకు తెలియజేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 14, 2024 / 01:28 PM IST

    Nagababu

    Follow us on

    Nagababu: మే 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక తెలంగాణ విషయం పక్కన పెడితే ఆంధ్రాలో మాత్రం అన్ని పార్టీ లా మధ్య ఈసారి గట్టి పోటీ ఎదురవ్వబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈసారి పక్కాగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీ మళ్లీ గవర్నమెంట్ ను ఫామ్ చేస్తుందో అనే సందేహానైతే వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నందుకు గాను చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకు మద్దతు తెలిపారు.

    ఇక దాంతో పాటుగా మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు అందరూ అతనికి సపోర్టు చేశారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ ప్రచారం చేశారు. ఇక రామ్ చరణ్ కూడా వాళ్ల తల్లితోపాటు చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక చిరంజీవి ఒక వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ కి తన మద్దతుని తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ మాత్రం ఒక ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ కి తను సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలియజేశాడు.

    ఇక ఇదిలా ఉంటే నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డి లకు అల్లు అర్జున్ కి ఫ్రెండ్ అవ్వడం వల్ల అతని కోసం ప్రచారంలో పాల్గొని ఆయన్ని భారీ మెజారిటీ తో గెలిపించాలంటూ ఆ నియోజికవర్గ ప్రజలకు తెలియజేశాడు. ఇక ఇది చూసిన మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసే టైం అయితే లేదుగానీ, నంద్యాలకు వెళ్లి శిల్ప రవిచంద్ర రెడ్డికి ఓటు వేసి గెలిపించమని చెప్పేంత టైం అయితే ఉందా అంటూ ఆయన పైన భారీ విమర్శలను అయితే చేశారు. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

    అది ఏంటి అంటే “తమతో ఉంటూ ప్రత్యర్థికి సహాయపడేవాడు మనవాడైన పరాయి వాడే. అలాగే తనకు హెల్ప్ చేసే పరాయివాడైన మనవాడే” అంటూ నాగబాబు ఎస్ వి ఎస్ ఎన్ వర్మ గురించి ఇలాంటి పోస్ట్ పెట్టాడు. ఇక వర్మ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన పార్టీ కోసం చాలావరకు కష్టపడ్డారు అని నాగబాబు ఇలాంటి పోస్ట్ ద్వారా తనకు అభినందనలు తెలియజేశాడు.. ఇక ఈ పోస్ట్ చూసిన చాలామంది అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటు సోషల్ మీడియా మొత్తంలో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు…