Kakinada Port Issue : కాకినాడ పోర్టు నుంచి రేషన్ దందాపై రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. కొద్దిరోజుల కిందట సౌత్ ఆఫ్రికా కు రేషన్ బియ్యం తో వెళ్తున్న షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పి సీజ్ చేశారు. అటు తరువాత నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ఆ షిప్ ను పరిశీలించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రం దందాను ఉక్కు పాదంతో అణచివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో వైసిపి ఎదురుదాడి చేస్తోంది. బియ్యం దందాలో టిడిపి నేతల సమీప బంధువులు ఉన్నారని ఆరోపిస్తోంది. ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ తరుణంలో కాకినాడ పోర్టు యజమానుల్లో ఒకరైన కెవి రావు సిఐడి ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగింది.
* బలవంతంగా వాటాలు లాగేసుకున్నారు
కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కెవి రావు.. ఒకప్పుడు కాకినాడ పోర్టు యజమానుల్లో ఒకరు. అయితే కాకినాడ సెజ్ లో తమకున్న వాటాను అక్రమంగా తమ నుంచి లాగేసుకున్నారని.. 2500 కోట్ల రూపాయల విలువ చేసే వాటాను కేవలం 494 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపిస్తూ సిఐడి కి ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టును, సెజ్ ను తమను బెదిరించి భయపెట్టి మరి తమ నుంచి లాగేసుకున్నట్లుగా పేర్కొన్నారు. సిఐడికి ఏకంగా 10 పేజీలతో కూడిన ఫిర్యాదును అందజేయడం విశేషం. అందులో సంచలన అంశాలను ప్రస్తావించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆ ఫిర్యాదులో వివరించే ప్రయత్నం చేశారు. ఆయన రాసిన వివరాలు ఇలా ఉన్నాయ.
* 2500 కోట్ల రూపాయల వాటాను 494 కోట్లకు లాక్కున్నారు.సెజ్ లో నా వాటా విలువ 1109 కోట్ల రూపాయలు.దానిని కేవలం 12 కోట్లకు లాగేసుకున్నారు.
* నిజాయితీగా వ్యాపారం చేసాం. ప్రభుత్వానికి రూపాయి కూడా పన్ను ఎగ్గొట్టలేదు.అయినా సరే తీరని అన్యాయం చేశారు. వైసీపీ కీలక నేత వై వి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చెప్పినట్లుగా చేయాలని చెప్పారు. కనీసం మా మాటలను కూడా వినలేదు.
* ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. కాకినాడ పోర్టును డెవలప్ చేసాం.జిఎంఆర్ తో కలిసి కాకినాడ సెజ్ ను ఏర్పాటు చేసాం. దీనికోసం కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. మా కంపెనీలో ఆదాయం 22 శాతం ప్రభుత్వానికి చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది.
* 2019 వరకు అంత సవ్యంగానే నడిచింది. ఆ తరువాతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మా సంస్థ ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టినట్లు రిపోర్టులు చూపారు. అప్పుడే విజయసాయిరెడ్డి తో పాటు విక్రాంతి రెడ్డిని కలవాలని చెప్పారు. మమ్మల్ని బెదిరించి మా కంపెనీ షేర్లు అమ్మేందుకు సిద్ధపడ్డారు. బలవంతంగా లాక్కున్నారు. అంతా తమకే కట్టబెట్టాలని అరబిందో యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. కుటుంబమంతా జైలుకు పంపిస్తామని హెచ్చరించడంతో భయపెట్టి విక్రయించాం. అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు కెవి రావు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Kakinada port scandal kv rao complaint with cid against vijayasai reddy and two firms
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com