KA Paul Vs R Krishnayya
KA Paul : గతంలో ఆయన మీడియాలో విపరీతంగా కనిపించేవారు. మీడియా కూడా ఆయన ఇంటర్వ్యూలు చేయడానికి ఆసక్తిని చూపించేది. ఇటీవల కాలంలో కేఏ పాల్ అంతగా మీడియాలో కనిపించడం లేదు. మీడియా కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఖాతాలు సృష్టించుకుని తన చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియా విషయం తెలిసిందే కదా.. కే ఏ పాల్ మాట్లాడిన మాటలు.. తనకు అనుకూలంగా ఉంటే చాలు ఆ పార్టీ నాయకులు పాల్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేఏ పాల్ బీసీ రిజర్వేషన్ల మీద.. బిసి ఉద్యమ నాయకుడు కేఏ పాల్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఆర్ కృష్ణయ్య పై అన్నేసి మాటలు
ఆర్ కృష్ణయ్య సుదీర్ఘకాలంగా బీసీ ఉద్యమం చేస్తున్నారు. బీసీల సమస్యలపై పోరాడుతున్నారు. అయితే ఆర్ కృష్ణయ్య పై కేఏ పాల్ తీవ్రంగా విమర్శలు చేశారు. ” మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. అటు తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు బిజెపిలో ఉన్నారు. ఆయనకు రాజ్యసభ ఇస్తే చాలు.. 50 లేదా 100 కోట్లు ఇస్తే చాలు బీసీలను ఆ పార్టీకి ఓట్లు వేయాలని పిలుపునిస్తారు.. 60 శాతం జనాభా ఉన్న బీసీలను రెండు శాతం జనాభా కాళ్ల వద్ద బానిసలుగా ఉండమని చెబుతారు. బీసీలకు రాజ్యాధికారం వద్దా.. ఆర్ కృష్ణయ్య లాగా బిచ్చమెత్తుకోవాలా.. అంబేద్కర్ కోరుకున్న రాజ్యాధికారం సాధ్యం కావాలంటే బీసీలు సంఘటితంగా పోరాడాలి. రాజ్యాధికార కోసం ఉద్యమాలు చేయాలని” కేఏ పాల్ పిలుపునిచ్చారు. కెఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా.. దీనిపై బీసీ ఉద్యమ నాయకులు మండిపడుతున్నారు. ఆర్ కృష్ణ పై కేఏ పాల్ మాట్లాడిన మాటలు దారుణమని.. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని బీసీ ఉద్యమ నాయకుల హెచ్చరించారు. ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని.. కేఏ పాల్ ఒక్కసారైనా బీసీల సమస్యలపై ఉద్యమాలు చేశారా అని.. బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేఏ పాల్ తిక్క తిక్కగా మాట్లాడితే సమాధానం మరింత సూటిగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. కేఏ పాల్ మాట్లాడిన మాటలను బీసీ నాయకులు ఖండిస్తున్నారు. ఇలాంటి మాటలు కే ఏ పాల్ మాట్లాడటం దారుణమని అంటున్నారు. ఇంకో సారి ఇలాంటి మాటలు కే ఏ పాల్ మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Dr K A Paul about BC BJP MP R Krishnayya . Must watch & share pic.twitter.com/5ZERrkaRkG
— Dr KA Paul (@KAPaulOfficial) February 24, 2025