Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR :  దేవర సినిమాకు అడ్డంకులు.. చంద్రబాబు వద్దకు జూనియర్ ఎన్టీఆర్.. నిజమెంత?*

Junior NTR :  దేవర సినిమాకు అడ్డంకులు.. చంద్రబాబు వద్దకు జూనియర్ ఎన్టీఆర్.. నిజమెంత?*

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఇబ్బంది పెట్టనున్నారా? కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఎదురుకానుందా? దేవర సినిమా టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ.కొద్ది రోజుల్లో దేవర సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో యంత్రాంగం ఎలా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్న. టికెట్ల పెంపు విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం స్పష్టమైన జీవో జారీ చేసింది. కల్కి సినిమా నుంచే టికెట్ల పెంపునకు సంబంధించి అనుమతులు ఇచ్చింది. అప్పటినుంచి అమలవుతూ వస్తోంది. అయితే ఆ చిత్రం అశ్వినీ దత్ కుటుంబ సభ్యులది కావడం వల్లే ప్రభుత్వం చొరవ చూపి అనుమతులు ఇచ్చింది అన్నది ఒక వాదన. దేవర విషయంలో అలా కాదు. జూనియర్ ఎన్టీఆర్ ను తన వద్దకు రప్పించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలా అయినా ఎన్టీఆర్ను తన వద్దకు రప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

* ఇరు కుటుంబాల మధ్య గ్యాప్
చంద్రబాబుతో ఎన్టీఆర్ గ్యాప్ ఏర్పడిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఇది మరింత ఎక్కువయ్యాయని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. టిడిపి కార్యక్రమాలతో కానీ.. నారా కుటుంబంతో కానీ.. బాబాయ్ బాలకృష్ణ తో కానీ.. తారక్ సన్నిహితంగా ఉండడం లేదు. వారి విషయంలో ఏం మాట్లాడడం లేదు. పైగా ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా తారక్ అభిమానులను ఎగదోశారన్నఅనుమానాలు ఉన్నాయి.

* కార్యక్రమాలకు దూరం
తారక్ నందమూరి కుటుంబ సభ్యుల విషయంలో సైతం ఆచితూచి వ్యవహరించేవారు. తాత నందమూరి తారకరామారావు పై ఎనలేని అభిమానం ఉన్నా.. ఆయన శత జయంతి వేడుకలకు హాజరు కాలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నిర్వహించడంతోనే ఆయన ముఖం చాటేసారని అప్పట్లో ప్రచారం జరిగింది. మేనత్త నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కూడా సరిగ్గా స్పందించలేదు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఇటీవల అమరావతి వచ్చి వరద బాధితులకు సాయం అందజేస్తారని ప్రచారం జరిగినా.. భారత్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

* చంద్రబాబు పట్టించుకుంటారా
అయితే సాధారణంగా చంద్రబాబు సినిమా వ్యవహారాల్లో తల దూర్చారు.రాజకీయాల వరకే పరిమితం అవుతారు. తారక్ విషయంలో కానీ.. ఆయన చిత్రం దేవర విషయంలో కానీ కలుగజేసుకోరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దేవర విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. మల్టీప్లెక్స్ లలో 325 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 200 రూపాయలు టికెట్లు ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version