YS Vivekananda Reddy murder case : వివేక హత్య కేసులో కీలక ట్విస్ట్.. కోర్టులో తీర్పు రిజర్వ్!

వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు దాటుతోంది. కానీ కేసు ఒక కొలిక్కి రాలేదు. గత ఐదేళ్లలో విచారణలో జాప్యం జరిగింది. కూటమి ప్రభుత్వం నేపథ్యంలో విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 30, 2024 2:15 pm

YS Vivekananda Reddy murder case

Follow us on

YS Vivekananda Reddy murder case : ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి. ఆయన సైతం కడప ఎంపీగా,మంత్రిగా సేవలందించారు.కానీ హత్యకు గురైఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు..నిందితులకు శిక్ష పడలేదు.ఇంకా కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.గత ఐదేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా చూడాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు.స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులను కలిశారు.అనేక విన్నపాలు చేశారు.కాగా ఇదే కేసులో ఉమా శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైతెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.వివేక కుమార్తె సునీత తన వాదనలు వినిపించారు. కేసు విచారణ పై హైకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది.

* సునీత ఆవేదన అదే
అయితే ఈ కేసులో తీవ్ర జాప్యం జరుగుతుండడం పై సునీత ఆవేదన వ్యక్తం చేశారు.కేసు నీరుగాడ్చేలా అనేక కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.పలుకుబడి కలిగిన పెద్ద వ్యక్తులు కేసును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితులను బెయిల్ పై విడుదల చేస్తే తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉందని.. సాక్షాలను సైతం తారుమారు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

* బెయిల్ పై విచారణ
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ3గా గజ్జల ఉమా శంకర్ రెడ్డి ఉన్నారు.ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.సునీత తరపున న్యాయవాది గౌతమ్, సిబిఐ తరుపున అనిల్ తన్వర్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి చాలా రకాల అభ్యంతరాలను అటు సునీత న్యాయవాది, ఇటు సిబీఐ న్యాయవాది కోర్టు ముందు ఉంచారు.

* కేసు నీరుగార్చే ప్రయత్నం
పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రభావానికి గురయ్యే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం తాను సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంలో సిబిఐ పూర్తి వివరాలతో కౌంటర్ బాఖలు చేసిన తరువాత కూడా.. వాదనలు వినాలని పట్టుబడడం లేని విషయాన్ని పేర్కొన్నారు. ఈ కేసును మొదట విచారించిన సిఐ శంకరయ్య సిఆర్పిసి161 స్టేట్మెంట్ ఇచ్చారని.. మ్యాజిస్ట్రేట్ వద్ద మాత్రం సి ఆర్ పి సి 164 స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. కేసులో ఏ 6 గా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను భయపెట్టే ఉద్దేశంతో కేసు నమోదు చేసిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు.వివేకా పిఏ ఎంవి కృష్ణారెడ్డి ఏకంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి,దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై కేసు పెట్టిన విషయాన్ని సైతం కోర్టుకు వివరించారు.ఈ పరిణామాలన్నీ కేసును నీరుగారిచే విధంగా ఉన్నాయని.. అందుకే కోర్టు కలుగజేసుకొని కీలక ఆదేశాలు ఇవ్వాలని కోరారు.అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు.