https://oktelugu.com/

Jr.NTR Fans : క్యాన్సర్ పేషంట్ కోసం ఎన్టీఆర్ అభిమాని షాకింగ్ నిర్ణయం.. బిల్లు చెల్లించడంతో కాంట్రవర్సీకి చెక్..

తన అభిమాని కౌశిక్ కు సాయం చేస్తానని తెలిపాడు. కానీ దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో చాలా మంది రకరకాల పోస్టులు పెట్టారు. వీటిపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : December 25, 2024 / 05:40 PM IST

    Jr.NTR Fans

    Follow us on

    Jr.NTR Fans :పుష్ప’ ఇష్యూ తరువాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న టాపిక్ అయినా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సాధారణ పౌరులు ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేటేస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ విషయాన్ని రేజ్ చేశారు. గతంలో ఎన్టీఆర్ అభిమాని అయిన కౌశిక్ క్యాన్సర్ తో బాధపడుతూ ‘దేవర’ సినిమా చూడాలని ఉందని అన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన అభిమాని కౌశిక్ కు సాయం చేస్తానని తెలిపాడు. కానీ దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో చాలా మంది రకరకాల పోస్టులు పెట్టారు. వీటిపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే?

    ఈ మధ్య సినిమాల కోసం వీరాభిమానం పెంచుకున్నవారు ఆపదలో ఉన్నా.. తమ హీరోల గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు క్రేజీగా ఉంటాయి. దీంతో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు,కన్నడంలోనూ అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరైన కౌశిక్ క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ‘దేవర’ సినిమా చూడాలని ఉందన్నారు. కొన్ని రోజుల కిందట కౌశిక్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

    తన కోసం తపిస్తున్న కౌశిక్ కు అండగా ఉంటానని, తన వైద్య ఖర్చులు చెల్లిస్తానని అన్నారు. అయితే దేవర మూవీ తరువాత ఎన్టీఆర్ తన కుమారుడి గురించి పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి ఓ మీడియాతో వ్యాఖ్యలు చేసింది. ఇవి వైరల్ గా కావడంతో కొందరు ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. అయితే వీటిపై ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వీరిలో ఒకరు కౌశిక్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. కౌశిక్ కు కావాల్సిన డబ్బులు అందించిన అతని ఆసుపత్రి బిల్లును సెటిల్ చేశాడు. ఆ తరువాత ఆ బిల్లుకు సంబంధించిన రిసిప్ట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘కౌశిక్ తల్లిని ఉపయోగించి కాంట్ర వర్సీలు క్రియేట్ చేసిన వారు ఇక విశ్రాంతి తీసుకోండి’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుపై ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

    కౌశిక్ చికిత్స కోసం ప్రభుత్వం రూ.11 లక్షలు పంపిందని, టీటీడీ నుంచి రూ.40 లక్షలు వచ్చాయని కౌశిక్ తల్లి సరస్వతి తెలిపింది. అయితే మరో రూ.20 లక్షలు కట్టాలని ఆసుపత్రి వారు అడుగుతున్నారని సరస్వతి తెలపగా ఎన్టీఆర్ అభిమాను స్పందించి వెంటనే ఆ మొత్తాన్ని కట్టేశాడు. దీనిపై ఎన్టీఆర్ నేరుగా స్పందించకపోయినా ఆయన అభిమానులు ముందుకు రావడంపై చాలా మందిప్రశంసిస్తున్నారు. కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్చి కావడంతో ఆయన కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి.