Homeఆంధ్రప్రదేశ్‌Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గృహహింసతో పాటు వరకట్న వేధింపులకు గురి చేశారంటూ ఆ కుటుంబంలో 11 మందిపై ఫిర్యాదు చేశారు. అయితే సాధారణంగా ఓ ప్రముఖ కుటుంబం పై ఇలాంటి ఫిర్యాదులు వస్తే అవి సంచలనంగా మారుతాయి. జోగి రమేష్ విషయంలో కూడా అలా జరిగింది అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆయన కోడలు, ఒక విధంగా నవవధువు అయిన మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు సంచలన అంశాలను జోడించారు. తనను భౌతికంగా, మానసికంగా వేధించడమే కాకుండా పలుమార్లు చంపేందుకు ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.

* అదనపు కట్నం కోసం..
గత ఏడాది మేలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనతో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు వివాహం జరిగింది. ఆ సమయంలో ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో పాటు కేజీ నర బంగారం, 10 కిలోల వెండి, ఇతర కానుకలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే అదనంగా ఐదు కోట్ల రూపాయల నగదు, ఫార్చునర్ కారుతో పాటు అత్త, ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె పేరుతో ఉన్న ఆస్తులను భర్త రాజీవ్ పేరుతో బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, పెళ్లికి ముందు భర్తకు ఉన్న శారీరక సమస్యలను దాచి పెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు మేఘన. ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

* చాలాసార్లు మట్టుబెట్టే ప్రయత్నం..
అన్నింటికీ మించి మేఘనను పలుమార్లు చంపేందుకు ప్రయత్నాలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. బాధితురాలు కూడా అదే చెబుతోంది. ఒకసారి ఇంటి టెర్రస్ పైనుంచి మామ జోగి రమేష్, సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి తోసేయడానికి ప్రయత్నం చేశారు అనేది మేఘన చేస్తున్న ఆరోపణ. గోవా ట్రిప్ కు వెళ్లే సమయంలో కూడా.. బోటు లోంచి నీటిలో నెట్టేయడానికి ప్రయత్నించి.. ఎవరు లేని ప్రాంతంలో వదిలేసి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. హైదరాబాదు నార్సింగి లోని విల్లాకు తీసుకెళ్లి కొట్టి.. కాళ్లతో తన్ని.. దిండుతో ముఖాన్ని నొక్కి చంపాలని చూశారని కూడా ఆమె వాపోయారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో మామ జోగి రమేష్ ముఖంపై దిండు గట్టిగా నొక్కిపెట్టగా.. భక్త రాజీవ్ మెడకు చున్ని బిగించి చంపేందుకు ప్రయత్నం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్టుగా వింటానని కాళ్లపై పడి వేడుకోవడంతోనే తనను ప్రాణాలతో వదిలేసారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆమె స్పష్టం చేయడం విశేషం. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. కానీ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...
YSR Congress

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...
OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
Oktelugu Epaper