Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena survey shock : సంచలన సర్వే..పవన్ కు షాక్..త్వరలో జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం

Jana Sena survey shock : సంచలన సర్వే..పవన్ కు షాక్..త్వరలో జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం

Jana Sena survey shock : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. జూన్ 4 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన శతశాతం విజయంతో సత్తాచాటింది. 21 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి అన్నిచోట్ల విజయం సాధించింది. కేవలం రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీచేసి వాటిని కైవసం చేసుకుంది. దీంతో పవన్ మేనియా జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పెరిగింది . దేశ రాజకీయాల్లో పవన్ ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. ఏకంగా కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. జనసేనకు చెందిన నాదేండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ కు మంత్రి పదవులు వరించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలను సైతం ఆ పార్టీ సొంతం చేసుకుంది. అయితే ఏడాది పాలన పూర్తవుతుండడంతో పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందని పవన్ సర్వే చేయించినట్టు తెలుస్తోంది. అందులో షాకింగ్ పరిణామాలు వెలుగుచూసినట్టు సమాచారం.

Also Read : ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ‘తిరుమల రద్దీ’ సమస్యకు పరిష్కారమే లేదా?

ఆ జిల్లాల్లోనే ఎక్కువ ప్రాతినిధ్యం..
గత ఎన్నికల్లో జనసేన ఎక్కువగా ఉభయగోదావరితో పాటు విశాఖ జిల్లాలో ఎక్కువగా పోటీచేసింది. ఉమ్మడి విజయనగరంలో రెండు స్థానాల్లో బరిలో దిగింది. కోస్తాతో పాటు రాయలసీమలో సైతం కొద్దిపాటి స్థానాల్లో మాత్రమే పోటికి దిగింది. అయితే అన్నిచోట్ల విజయం సాధించి సంచలనంగా మారింది. అయితే కేవలం కూటమి కట్టడం, టీడీపీ ఓట్లు బదలాయింపు బాగా జరగడంతో ఈ విజయం సాధ్యమైంది. అయితే గెలిచిన జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? అనే దానిపై జరిగిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న వారిలో ఎక్కువ మంది ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ తీరుపై వ్యతిరేకత లేకపోయినా.. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని రావడం మాత్రం షాకింగ్ పరిణామం.

అవినీతి ఆరోపణలు..
ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల్లో బంధుప్రీతి, అవినీతి, లిక్కర్, శాండ్ మాఫియాలకు నాయకత్వం వహిస్తుండడంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఇది నిజమేనని సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. జనసేన రాజకీయ వ్యవహారాలు చూసే ఓ సంస్థ ఈ సర్వే చేపట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ సైతం ఓకింత షాక్ కు గురైనట్టు సమాచారం. అందుకే త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. జూన్ 12న కూటమి పాలన చేపట్టి ఏడాది అవుతున్నతరుణంలో విజయోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేక సమావేశం అవుతారని సమాచారం.

హెచ్చరికలు ఖాయమా?
అయితే ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలకు ఈ సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సర్వే రిపోర్టులో ఏముందోనని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అధినేత ఎలాంటి హెచ్చరికలు జారీచేస్తారోనని భయపడుతున్నట్టు సమాచారం. పవన్ ఇటువంటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటారు. ముందుగా పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తారు. అక్కడకు వినకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంటానని కూడా హెచ్చరిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular