Atul Wassan Comments On Gambhir: టీమ్ ఇండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ ఒక ఓటీటీ షోలో గంభీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గంభీర్ సెలక్స్ చేయడు.. కేవలం రిజెక్ట్ మాత్రమే చేస్తాడని అన్నాడు. భారత జట్టు ఎంపికలో కోచ్ కు కూడా కీలక పాత్ర ఉంటుందని వివరించాడు. శ్రేయస్ ను టీమ్ లోకి ఎందుకు తీసుకోలేదో అతడు వివరంగా చెప్పి ఉండాల్సిందని అతుల్ వాసన్ అన్నాడు. శ్రేయస్ అయ్యార్ ను ఎంపిక చేయకపోవడంపై పలువురు క్రీడాభిమానులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న అతడిని జట్టులో చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదంటున్నారు.