Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena Party Updates:పవన్ ను వద్దనుకున్న నేత జనసేనలోకి?

Jana Sena Party Updates:పవన్ ను వద్దనుకున్న నేత జనసేనలోకి?

Jana Sena Party Updates: ఏపీ( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మరోవైపు కూటమి పార్టీలు ఐక్యంగా ఉంటూనే బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు పవన్ భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి పెట్టారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. వివిధ కారణాలతో జనసేనలోకి వచ్చి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి ఆహ్వానించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జనసేనలో చేర్చుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు లక్ష్మీనారాయణ సైతం తాను పవన్ విషయంలో వేసుకున్న లెక్క తప్పిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ తప్పుడు అంచనా తోనే తాను జనసేన ను వీడాల్సి వచ్చిందని.. లేకుంటే మాత్రం తప్పకుండా జనసేనలో కొనసాగి ఉండే వాడినని చెప్పారు.

Also Read: మహిళలతో కలిసి బస్సులో బాబు, పవన్.. ఈ అరుదైన వీడియో చూడాల్సిందే

దేశవ్యాప్తంగా ప్రాచుర్యం..
దేశవ్యాప్తంగా సిబిఐకి సంబంధించి కీలక కేసుల విచారణ చేపట్టారు జేడీ లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana). జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ చేపట్టడంతో అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అయితే ఉన్నట్టుండి లక్ష్మీనారాయణ సిబిఐకి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఏపీలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. సామాజిక రుగ్మతలపై గట్టిగానే మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా జనసేనలో చేరారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన తరఫున గణనీయమైన ఓట్లు పొందారు. జనసేన ఓడిపోవడంతో పాటు పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తారని తెలియడంతో ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2024 ఎన్నికలకు ముందు లక్ష్మీనారాయణ జనసేనలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు.

అలా సంకేతాలు..
అయితే ఇప్పుడు తిరిగి జనసేనలోకి( janasena ) వెళ్తారని మాత్రం ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పారు లక్ష్మీనారాయణ. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తనను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించారని.. సమాజంలో మార్పు కోసం తపిస్తున్న ఇద్దరి అభిప్రాయం ఒకటేనని.. కలిసి అడుగేద్దామని పవన్ చెప్పారని.. అందుకే తాను జనసేనలో చేరి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశానని చెప్పారు లక్ష్మీనారాయణ. కానీ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్తానని చెప్పడంతో.. రాజకీయాల్లోకి వచ్చాక మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం కరెక్ట్ కాదన్న అంచనా తోనే తాను జనసేన నుంచి బయటకు వచ్చేసానని చెప్పారు. కానీ పవన్ అంచనా కరెక్ట్ అని.. ఆయన అంచనా ఫలించిందని తాజాగా చెప్పుకొచ్చారు. తద్వారా పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేనలో చేరేందుకు తాను సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు.

Also Read: కాంగ్రెస్ వెనుక విదేశీ శక్తులు.. పవన్ బిగ్ బాంబ్

ఆ అంచనాలతోనే..
వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు బలమైన అభ్యర్థులు అవసరం. నియోజకవర్గాల పునర్విభజన తో ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. జనసేనకు ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కొంతమందిని మార్పు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులను పార్టీలోకి తెచ్చుకుంటే.. పార్టీకి మైలేజ్ రావడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం పనికొస్తారని అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే జెడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పవన్ గెలిచిన తీరును కూడా జేడీ ప్రశంసిస్తున్నారు. తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు పవన్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని.. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు పవన్ అవసరాన్ని గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. తద్వారా జనసేనలో జేడీ రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారానికి సంకేతాలు పంపిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular