MLA Arava Sridhar: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంగళవారం సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకమైన పార్టీగా ఉన్న జనసేన ఎమ్మెల్యే కు సంబంధించిన ఒక వీడియోను వైసీపీ బయట పెట్టింది. ఆ వీడియో అత్యంత దారుణంగా ఉంది. అందులో మాట్లాడిన భాష కూడా అత్యంత హేయంగా ఉంది.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కు సంబంధించిన ఒక వీడియోను వైసీపీ బయట పెట్టింది..” ఏడాది క్రితం నుంచి ఒక మహిళను వేధిస్తున్నాడు. ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. 2024 శాసనసభ ఎన్నికల్లో శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వ శాఖలో కిందిస్థాయి ఉద్యోగిగా పని చేస్తున్న ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ సందేశానికి శ్రీధర్ రిప్లై కూడా ఇచ్చారు.. ఇక అప్పట్నుంచి ఆమెతో శ్రీధర్ చనువు పెంచుకున్నారు. నీతో మాట్లాడాలి.. వ్యక్తిగతంగా కలవాలి అంటూ ఆమెకు అనేక సందర్భాలలో మెసేజ్ పెట్టారు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారూ ఇలా అంటున్నారు అంటూ సమాధానాన్ని దాటవేసిందని” వైసిపి ఆ వీడియోను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
” నీ పేరు ఏంటి? తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? వివాహం జరిగిందా? భర్త ఏం చేస్తుంటాడు? పిల్లలు ఎంతమంది? మీ వయసు ఎంత? మీ ఇంటి చిరునామా చెప్పండి” అంటూ శ్రీధర్ ఆమె వివరాలు తీసుకున్నాడని వైసిపి పేర్కొంది.
” ఆమె చెప్పిన వివరాల ఆధారంగా.. ఆ మహిళకు పేరెంట్స్ లేరని ఎమ్మెల్యే తెలుసుకున్నాడు. ఆమె భర్త ఐటి ఉద్యోగిగా హైదరాబాదులో పని చేస్తున్నాడని గుర్తించాడు. ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఒక గ్రామం సమీపంలో ఆమె మీద బలాత్కారం చేయబోయాడు. ఆమె వారించినప్పటికీ.. జుట్టు పట్టుకొని కారులోనే దారుణం చేశాడు. అంతేకాదు పలుమార్లు ఆమెపై ఇలానే చేశాడు. ఆ తర్వాత భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. దానికి ఆమె ఒప్పుకోక పోవడంతో ఇబ్బంది పెట్టాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి బీభత్సం సృష్టించాడు. దీంతో ఆ మహిళకు, భర్తకు విభేదాలు ఏర్పడ్డాయి. తాను చెప్పినట్టు విడాకులు ఇవ్వకపోతే ఆ మహిళ మూడు సంవత్సరాల కుమారుడిని చంపేస్తానని హెచ్చరించాడు. పథకాలంగా శ్రీధర్ ఇలా వేధిస్తూ ఉండడంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. చివరికి ఆ వివరాల మొత్తం బయటపెట్టింది. జనసేన ఎమ్మెల్యే ఈ స్థాయిలో అరాచకానికి పాల్పడడాన్ని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చని” వైసీపీ సోషల్ మీడియా పేర్కొంది.