Janasena Formation Day: జనసేనలో ( janasena )జోష్ నెలకొంది. పార్టీ గెలిచిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటోంది. ఎందుకు పిఠాపురం ముస్తాబయింది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో 50 ఎకరాల ప్రాంగణంలో జనసేన ప్లీనరీ జరగనుంది. దీనికి జయకేతనం అని పేరు పెట్టారు. జనసేన ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 12వ ఏడాదిలో అడుగు పెట్టింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఉత్సాహంగా జనసేన ప్లీనరీకి సిద్ధపడింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేలా చేయాలని ఏర్పాటు చేశారు.
Also Read: జనసేన ‘జయకేతనం’.. ప్రత్యేక ఏర్పాట్లు ఇవే!
* సొంత ఇమేజ్ తో
సినీ రంగంలో( cinema field) తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. విశేష జనాదరణ పొందారు. అటు తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రారంభంలో ఆయనకు ప్రజాదరణ దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024 ఎన్నికల్లో 100% విజయాన్ని దక్కించుకున్నారు. జనసేన పోటీ చేసిన ప్రతి చోటా ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారం లేకుండానే పార్టీ కార్యక్రమాలు ధీటుగా నిర్వహించేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
* అంతటా సందడి
ఒకవైపు హోలీ పర్వదినం.. మరోవైపు జనసేన( janasena ) ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండడంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే జనసేన సైనికులకు దిమ్మతిరిగే ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సభ వేదికగానే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. మెగా అభిమానులతో పాటు జనసైనికులకు డబుల్ జోష్ అంటూ వార్తలు వస్తున్నాయి. అకిరా నందన్ నిత్యం తండ్రి పవన్ తో కనిపిస్తుంటారు. ఈ తరుణంలో జనసేన వేదికపై కనిపిస్తే వీర లెవెల్ లో ఉంటుందని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* తండ్రి మాదిరిగా ప్రత్యేకతలు
అకిరా నందన్( Akira Nandan) సైతం తండ్రి మాదిరిగా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే కుంగ్ ఫూ, కరాటే తో పాటు మ్యూజిక్, డాన్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అకిరా నందన్ కంపోజ్ చేసిన సాంగ్స్, వీడియోలను తల్లి రేణు దేశాయ్ పోస్ట్ చేస్తుంటారు. అయితే జనసేన ప్లీనరీ వేదికగా ఆకీర కలరిపట్టు అనే ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ కార్యక్రమం పై మరింత అంచనాలు పెరిగాయి.
Also Read: జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!