Nara Lokesh : జగన్ తల్లి, చెల్లి టార్గెట్.. ఇలా అయితే లోకేష్ కి కష్టం

వైసీపీ చేస్తున్నది ఇప్పడు అదే. మామకు వెన్నుపోటు పొడిచిన నీ తండ్రి చంద్రబాబు చరిత్ర నీకు తెలియదా అంటూ వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా లోకేష్ పై ప్రచారం చేస్తోంది. ఇటువంటి వ్యాఖ్యలతో లోకేష్ కు మేలు కంటే కీడే అధికం. అందుకే ఈసారైనా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Written By: Dharma, Updated On : July 4, 2023 9:54 am
Follow us on

Nara Lokesh : నాన్నారు గురించి లోకేషం కు తెలియనట్టుంది. అందుకే మాటమాటకు జగన్ తల్లిని, చెల్లిని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తాను అధికారంలోకి రావడానికి ఎంతగానో కృష్టిచేసిన సొంత కుటుంబసభ్యులనే దారుణంగా వంచించారని ఆరోపిస్తున్నారు. అటువంటి వ్యక్తి ప్రజలకు ఏం మంచి చేయగలడని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు, పాలన, మంచీ చెడులను పక్కనపెడితే ఎన్డీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేసి చంద్రబాబు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు బహుశా లోకేష్ ది చిన్న వయసు కావొచ్చు. పైగా ఈ రాజకీయాలు, కుటుంబంలో జరిగిన పరిణామాలు తెలియకపోవచ్చు. అందుకే తమ కుటుంబంలో ఏమీ జరగనట్టు.. ఇప్పుడు జగన్ కుటుంబంలోనే అటువంటివి జరుగుతున్నట్టు భావిస్తున్నారు.

తమను జగన్ పట్టించుకోవడం లేదని స్వయంగా ఆయన సోదరి షర్మిళ చెప్పిన సందర్భాలున్నాయి. వారు ఇబ్బందులు పడినప్పుడు జగన్ సైతం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. వారి మధ్య చెడిందని కూడా అందరికీ తెలుసు. వారు జగన్ కు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని తెలిసినప్పుడే వారి మధ్య వైరం కొనసాగుతోందని అర్ధమైంది. అయితే ఆ కుటుంబ వ్యవహారాన్ని లోకేష్, చంద్రబాబు ఎత్తిచూపకూడదు. వారు ఒక వేలెత్తి చూపిస్తే అటు నుంచి పది వేళ్లు కనిపించే పరిస్థితి ఉంది. ఇది తెలియకుండా లోకేషం మాట్లాడితే మాత్రం అంతకు మించి ఆయన విమర్శలు ఎదుర్కొవాలసి ఉంటుంది.

కుటుంబాలన్నాక విభేదాలుంటాయి. రాజకీయ వారసత్వం విషయంలో పోటీ ఉంటుంది. అంతెందుకు మరాఠా రాజకీయాల్లో జరిగింది అదే. సొంత కుమార్తెకు శరద్ పవర్ అందలమెక్కించారని మేనల్లుడు అజిత్ పవర్ ఏకంగా పార్టీని ఎత్తుకుపోయారు. రాజకీయాల్లో ఇదో సర్వసాధారణ ప్రక్రియగా మారిపోయింది. అయితే ఇటువంటి కుటుంబ వెన్నుపోట్లకు మాత్రం ఆజ్యం పోసింది చంద్రబాబే. ఈ విషయం లోకేష్ గ్రహించుకోవాలి. ప్రత్యర్థి కుటుంబాల రాజకీయం గురించి అస్సలు మాట్లాడుకోకూడదు. అదేచేస్తే తన తండ్రి ఎపిసోడే అందరికి గుర్తుకొస్తుంది. వైసీపీ చేస్తున్నది ఇప్పడు అదే. మామకు వెన్నుపోటు పొడిచిన నీ తండ్రి చంద్రబాబు చరిత్ర నీకు తెలియదా అంటూ వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా లోకేష్ పై ప్రచారం చేస్తోంది. ఇటువంటి వ్యాఖ్యలతో లోకేష్ కు మేలు కంటే కీడే అధికం. అందుకే ఈసారైనా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.