Jagan: బిహార్ ఎన్నికలు( Bihar elections) కాంగ్రెస్ పార్టీని నైరాశ్యంలో పడేశాయి. బిహార్ ఎన్నికల్లో మహా ఘాట్ బంధన్ గెలుపుతో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని వ్యతిరేక పార్టీలన్నీ అంచనా వేసుకున్నాయి. కానీ కాంగ్రెస్ తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీల అంచనాలు తప్పాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. బిహార్ లో ఎన్టీఏ గెలుపునకు రాహుల్ అసలు సిసలైన కారకుడిగా కొత్త లెక్కలు ప్రారంభమయ్యాయి,. ఇంతటి ఘోర ఫలితానికి రాహుల్ కారణమని ఆర్జేడీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దారుణంగా దెబ్బతిన్నామని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కంటే ముందు వరుసలో ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ కారణమని విశ్లేషణలు మొదలయ్యాయి. ఇటువంటి తరుణంలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదగాలంటే కొత్త వ్యూహాలు కావాలని వ్యాఖ్యానించడం ద్వారా కొత్త సమీకరణలకు తెరతీశారు. అంటే ప్రజాకర్షణ కలిగిన ప్రాంతీయ పార్టీలను కలుపుకెళ్లాలన్న సంకేతాలు ఇచ్చినట్టేనని తేలిపోయింది.
జగన్ కు ఉద్దేశించినవే..
అయితే ఇప్పుడు డీకే శివకుమార్( DK Sivakumar ) వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్నాటకతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేరళలో సైతం ఇండియా కూటమి పవర్ లో ఉంది. ఒక్క ఏపీలో మాత్రం టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అంటే దక్షిణాదిలో ఎన్టీఏ కంటే ఇండియా కూటమి బలం ఉంది. అయితే దానిని పదిలం చేసుకోవాలంటే ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డిని కలుపుకెళ్లాల్సిందేనని శివకుమార్ తేల్చి చెప్పినట్టయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ కంటే కర్నాటక కాంగ్రెస్ జగన్ కు సేఫ్ జోన్ లా ఉంది. అందుకే ఏపీలో ఓటమి తరువాత జగన్ ఎక్కువగా హైదరాబాద్ కంటే బెంగళూరులో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ లో సాక్షి మీడియాతో పాటు బిజినెస్ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నా.. బెంగళూరుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
కాంగ్రెస్ బలపడకపోవడంతో..
అయితే కాంగ్రెస్ పార్టీకి( Congress Party) సూపర్ విక్టరీ దక్కిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ కు మంచి ఊరట దక్కలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. అయితే ఇప్పటికే కర్నాటక కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక లైన్ పెట్టుకున్నారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఒక ప్రకటన చేయవచ్చని భావించారు. కానీ కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా ఆర్జేడీ బలాన్ని కూడా నీరుగార్చింది. అయితే ఈ ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ వ్యూహాలు మారాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. అయితే కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం తధ్యమనిపిస్తోంది. అయితే ఎంతమాత్రం తేడా కొడితే మాత్రం శివకుమార్ ఆలోచనలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో జగన్ సైతం శివకుమార్కు దగ్గరగా ఉంటారు. అయితే కర్నాటక కాంగ్రెస్ విషయంలో సానుకూలంగా ఉండే జగన్.. అగ్ర నాయకత్వం విషయంలో భిన్నంగా ఉంటారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీంతో జగన్ భవితవ్యం కర్నాటక కాంగ్రెస్ తో ముడిపడి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.చూడాలి మరి ఏం జరుగుతుందో?