https://oktelugu.com/

YS Jagan : టార్గెట్ షర్మిల.. వయా బాలయ్య.. గట్టి దెబ్బ కొట్టిన జగన్!

అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందుకు రావడానికి ఆలోచించేవారు జగన్. కానీ ఇప్పుడు రాక తప్పని అనివార్య పరిస్థితి. అందుకే తరచూ మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బాలయ్య తో పాటు షర్మిలపై అటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్.

Written By:
  • Dharma
  • , Updated On : November 21, 2024 / 01:52 PM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan :  గత కొద్దిరోజులుగా తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న రాజకీయంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. అందరి కుటుంబాల మాదిరిగా తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలపై మాట్లాడారు జగన్.ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ద్వారా తనపై జరుగుతున్న రాజకీయ దాడి గురించి ప్రస్తావించారు. మధ్యలో నందమూరి బాలకృష్ణను తెరపైకి తెచ్చారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. చాలామంది అరెస్ట్ అయ్యారు కూడా. అయితే జగన్ సొంత తల్లితో పాటు చెల్లెలిపై సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యంగా వర్ర రవీందర్ రెడ్డి విచారణలో ఇదే తేలింది అన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ఆదేశాలతోనే సోషల్ మీడియాలో తాము రెచ్చిపోయినట్లు కొందరు విచారణలో ఒప్పుకున్నట్లు టాక్ నడిచింది. ఈ తరుణంలో జగన్ స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుతో పాటు టిడిపి నేతల తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్.

    * నాటి ఇంటర్వ్యూను చూపే ప్రయత్నం
    గతంలో జగన్ తో షర్మిలకు సత్సంబంధాలు ఉండేవి. 2019 ఎన్నికల తర్వాత కూడా కొనసాగాయి. అదే సమయంలో సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు షర్మిల. అప్పట్లో తనపై టిడిపి సోషల్ మీడియా దాని గురించి ప్రస్తావించారు. అదంతా బాలకృష్ణ నివాసం నుంచి జరిగిందంటూ షర్మిల ఆరోపించారు. దానికి సంబంధించి సోషల్ మీడియా ఐడి అడ్రస్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో షర్మిల వెల్లడించిన ఈ అంశాలకు సంబంధించి వీడియోను జగన్ తాజాగా ప్రదర్శించారు. మీడియా సమావేశంలో ఏకంగా చూపించారు. అయితే జగన్ బాలకృష్ణ పేరును బయటకు తేవడం వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

    * ఒకే దెబ్బకు రెండు పిట్టలు
    అయితే జగన్ రెండు విషయాలను చెప్పదలుచుకున్నారు. స్వయంగా చంద్రబాబు బావమరిది ఇంటి నుంచి అప్పట్లో సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని గుర్తు చేశారు. అంటే సోషల్ మీడియాలో ప్రచారం ఇప్పటిది కాదని.. గతంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి సంస్కృతిని ప్రదర్శించిందని బయట పెట్టే ప్రయత్నం చేశారు జగన్. అదే సమయంలో షర్మిలకు సైతం కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అండతోనే షర్మిల తనపై అనుచిత వ్యాఖ్యలు చేయగలుగుతున్నారని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే షర్మిల నాడు ఆక్షేపించిన బాలకృష్ణ ప్రస్తావనను ఇప్పుడు తీసుకొచ్చారు. మొత్తానికైతే జగన్ ఏకకాలంలో తన ఇద్దరు ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్లు అయ్యింది.