Jagan Supports NDA: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోంది. జనసేనతో పాటు బిజెపి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. కేంద్రంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కీలక భాగస్వామిగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేశాయి. సహజంగానే ఈ మూడు పార్టీలను జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులుగానే భావించాలి. కానీ టిడిపి పైనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన ను టార్గెట్ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీని మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదు. ఏదైనా అనాల్సి వస్తే రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారే తప్ప.. కేంద్ర పెద్దలపై అస్సలు మాట్లాడడం లేదు. సందర్భం వచ్చినప్పుడు బిజెపి పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
* కేంద్రంలో టిడిపి కీలకం
సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఎన్డీఏలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. ఈసారి టిడిపి మద్దతు లేకుండా అధికారంలోకి రావడం బీజేపీకి ఇబ్బందికరమే. అయితే ఎన్డీఏలో టిడిపి బలం పటిష్టంగా ఉన్న సమయంలో.. ప్రత్యర్థిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే ఎన్ డి ఏ కు మద్దతు తెలపడం అనైతికం. అయితే లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి బేషరతుగా ఎన్డీఏ కు మద్దతు ప్రకటించారు. తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం ఎన్ డి ఏ అభ్యర్థికి ఓటు వేశారు. తద్వారా భవిష్యత్తులో బిజెపితో అని సంకేతాలు పంపారు. తాను ఎన్డీఏకు వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
* ఇక్కడ వ్యతిరేకం.. అక్కడ మద్దతు..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) జాతీయస్థాయిలో ఏ కూటమిలో లేరు. అలాగని ఏపీలో తన ప్రత్యర్థిగా ఎన్డీఏ కూటమి ఉంది. కానీ జాతీయస్థాయిలో అదే కూటమికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడం మాత్రం జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల అధికార పరంపరను కొనసాగించారు. వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మరో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొత్తం 25 ఏళ్ల పాటు తన అధికార ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇదే విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు ప్రధాని మోదీ. దీంతో దేశవ్యాప్తంగా బిజెపితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఒక దేశ ప్రధానిగా ఏ రాజకీయ పార్టీ నేత అయిన శుభాకాంక్షలు తెలుపవచ్చు. కానీ ఎన్డీయేతర రాజకీయ పార్టీలు కనీసం స్పందించిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. అయితే జగన్ కేవలం కేసుల భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. భవిష్యత్తులో ఆయన ఏ కూటమిలో చేరే అవకాశం లేకుండా చేసుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జగన్ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది.
* సొంత పార్టీలో విస్మయం..
అయితే బిజెపి ( Bhartiya Janata Party )విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది. ఒకవైపు ఒంటరి పోరు అంటూ సవాల్ చేస్తుంటే.. మరోవైపు ఇలా బిజెపి ప్రాపకం కోసం ప్రయత్నించడం ఏంటని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. బిజెపి కి సహకరించడం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు దూరం అవుతోంది. ఇది కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మైనస్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025