Amaravati CRDA Office: అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణం పై రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత వేగంగా అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు సంస్థల భవనాలకు సంబంధించి నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఏకంగా ఓ 10 బ్యాంకు ప్రధాన కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో శంకుస్థాపనలు జరగనున్నాయి. అదే సమయంలో మరో కీలక భవనం అందుబాటులోకి రానుంది. ఈనెల 13న ప్రారంభం కానుంది. ఇది కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మైనస్ కానుంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి పాలనను, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరుపుతూ వస్తోంది. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి సిఆర్డిఏ భవనం ఈనెల 13న ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.
* గతంలోనే నిర్మాణం..
అమరావతి రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించే బాధ్యత సిఆర్డిఏది( crda). అటువంటి కార్యాలయానికి భవనం అవసరం అని భావించి గతంలోనే టీడీపీ ప్రభుత్వం నిర్మాణాన్ని ప్రారంభించింది. అత్యాధునిక పరిజ్ఞానంతో.. అన్ని రకాల వసతులతో ఈ భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే పనులు ప్రారంభించిన తరుణంలో కీలక దశకు చేరుకున్నాయి. ఇంతలో వైసిపి అధికారంలోకి వచ్చింది. సిఆర్డిఏ భవనం పై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్లపాటు ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. చివరిలో హడావిడి చేసిందే తప్ప పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
* రాజధానికి ల్యాండ్ మార్క్ గా..
ఇప్పుడు కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డిఏ భవనం పై దృష్టి పెట్టింది. అమరావతి రాజధాని కి ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచేలా సిఆర్డిఏ భవనాన్ని నిర్మించింది కూటమి ప్రభుత్వం. అత్యాధునిక పరిజ్ఞానంతో.. అమరావతి రాజధాని కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో.. పాలనా విభాగమైన సీఆర్డీఏ భవనాన్ని భారీ హంగులతో నిర్మించగలిగారు సీఎం చంద్రబాబు. ఈనెల 13న వేడుకగా ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలినట్టే. ఇప్పటికే అమరావతి చూస్తే శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అమరావతిపై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే సిఆర్డిఏ భవనం ప్రారంభానికి నోచుకోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్టే. సిఆర్డిఏ భవనం నుంచే అమరావతి కార్యకలాపాలు, పురపాలక శాఖ పాలన కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే అమరావతిలో తొలి నిర్మాణం పూర్తి కావడం శుభ పరిణామమే..
Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025