Homeఆంధ్రప్రదేశ్‌Jagan Supporting Amaravati Farmers: అమరావతి రైతుల పక్షాన జగన్?

Jagan Supporting Amaravati Farmers: అమరావతి రైతుల పక్షాన జగన్?

Jagan Supporting Amaravati Farmers:  వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) అమరావతి విషయంలో ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఎందుకంటే ఆయన నోటి నుంచి అమరావతి అని మాట వస్తే మాత్రం అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఐదేళ్లు పాలించి అమరావతి గురించి ఒక్క రోజు కూడా ప్రస్తావన చేయలేదు. కనీసం అమరావతి ప్రాంతంలో ఉంటూ.. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించలేదు. పైగా అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని చూసారు. వారి ప్రజాస్వామ్య నిరసనలను సైతం సహించుకోలేకపోయారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి గురించి ప్రస్తావించడం అనేది సహేతుకం కాదు. ఇప్పుడు అమరావతి రైతుల పక్షాన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు సరైన న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు. అయితే తమ కోసం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి యేనా అని అమరావతి రైతులు ఆశ్చర్యపోతున్నారు.

* ఏకాభిప్రాయంతో రాజధాని..
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు( CM Chandrababu) అమరావతి రాజధానిని అందరి అభిప్రాయంతో ఎంపిక చేశారు. అయితే నాడు అమరావతికి సేకరిస్తున్న భూములు చాలవని.. మరింత సమీకరించాలని ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిండు సభలో ప్రకటన చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పేచీ పెట్టారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అలాగని మూడు రాజధానులను పూర్తి చేయలేకపోయారు. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. బొత్స లాంటి నేత అమరావతిని స్మశాన వాటికతో పోల్చారు. చివరికి అమరావతి కోసం సేకరించిన భూముల్లో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పంచి పెట్టాలని చూశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి రైతుల గురించి మాట్లాడుతుండడం మాత్రం నిజంగా విశేషమే.

* అడుగడుగునా ఉక్కు పాదం..
అమరావతి ( Amravati capital )రైతులు ఐదేళ్లపాటు తమ ఉద్యమాన్ని కొనసాగించారు. తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే.. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి మనసు కరగలేదు. అమరావతి రైతులు టెంట్లు వేసి నిరసన శిబిరాలు కొనసాగిస్తే.. పోలీసులతో అడుగడుగున వారిపై జులుం ప్రదర్శించారు. ప్రతిరోజు కర్ఫ్యూ వాతావరణం ఉండేది అమరావతి రాజధాని ప్రాంతంలో. తమ బాధను భగవంతుడికి చెప్పుకోవాలని అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవిల్లి పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రైతులు. కానీ ఎక్కడికి అక్కడే వారిని అడ్డగించి, వైసిపి మనుషులతో దాడి చేయించే ప్రయత్నం కూడా చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం అమరావతి రైతులకు అన్యాయం చేస్తోందని చెప్పడం మాత్రం వింత పరిణామమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version