Jagan: చంద్రబాబును చూసి నేర్చుకో జగన్

శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపికయ్యారు. ఆయనను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం ప్రతిపక్ష నేత ప్రధాన వీధి. ఆయన ఎంపికపై గౌరవంగా సభలో మాట్లాడడం కూడా ఒక సంప్రదాయం.

Written By: Dharma, Updated On : June 23, 2024 9:09 am

Jagan

Follow us on

Jagan: లీడర్ అంటే గెలిచేటప్పుడే కాదు.. ఓటమి చవి చూసేటప్పుడు కూడా నిలబడాలి.ప్రజల వాయిస్ ను బలంగా వినిపించాలి.అప్పుడే ప్రజలు నాయకుడిని నమ్మేది.నాయకత్వం కనిపించేది.ఈ విషయంలో జగన్ ఫెయిల్యూర్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.ఓటమి తర్వాత ఆయన వ్యవహార శైలి, శాసనసభలో అనుసరించిన తీరు, ప్రతిపక్ష నేతగా తాను పోషించాల్సిన పాత్ర నుంచి తప్పుకోవడం..ఇలా అన్నింటా వైఫల్యాలు కనిపిస్తున్నాయి.కేవలం ఓటమి ఎదురైందని..ప్రజలు తమకు వ్యతిరేక తీర్పు ఇచ్చారని జగన్ భావించడం భావ్యం కాదు. రాజకీయాలు అన్నాక గెలుపోటములు ఉంటాయి.కానీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందడుగు వేయడం నాయకుడి ప్రధాన లక్షణం.

శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపికయ్యారు. ఆయనను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం ప్రతిపక్ష నేత ప్రధాన వీధి. ఆయన ఎంపికపై గౌరవంగా సభలో మాట్లాడడం కూడా ఒక సంప్రదాయం.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి కేవలం 23 స్థానాలే దక్కాయి. అంతులేని విజయ గర్వంతో వైసీపీ సభ్యులు సభలో తొలి రోజునే గలాటా సృష్టించారు. స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అప్పటి సీఎం జగన్ ఎంపిక చేశారు. ఆయనకు గౌరవమైన సభాపతి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. స్పీకర్ నియామకం పై చంద్రబాబు మాట్లాడే క్రమంలో వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు.అయినా హుందాగా వ్యవహరించారు చంద్రబాబు. సీనియర్ నేతగా తమ్మినేని సీతారాం కు సముచిత స్థానం ఇవ్వడం పై వైసీపీ సర్కార్ కు అభినందనలు తెలిపారు. టిడిపి నుంచి ఎదిగిన తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.అది సభలో ఔన్నత్యాన్ని చాటింది.

ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలయ్యింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీనిని ఒక అవమానంగా భావించారు జగన్.ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో శాసనసభలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతాయని ముందుగానే అనుమానించారు. ఏకంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు.గత ఐదు సంవత్సరాలుగా తనకు తానుగా నిర్ణయాలు తీసుకున్న జగన్.. అధికారం కోల్పోయేసరికి పార్టీ నేతలు గుర్తుకొచ్చారు.వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మొన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరయ్యారు.కానీ గత ఐదేళ్లుగా వెళ్లిన మార్గంలో కాకుండా..వెనుక గేటు ద్వారా శాసనసభలో ప్రవేశించారు. తాను ప్రమాణ స్వీకారం చేసే సమయం కంటే ఐదు నిమిషాల ముందు శాసనసభకు హాజరయ్యారు. ఎంతో ఆందోళనతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి.. అంతే వేగంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

కేవలం జగన్ ఓటమి అనే ఆత్మనూన్యత అనే భావంతో గడిపారు. విజయమే లీడర్ షిప్ అని భావించారు. సభా సంప్రదాయాలను గాలికి వదిలేశారు. తనలో ఉన్న బెరుకుతనం, ఆందోళనను బయట పెట్టుకున్నారు.గెలుపు కాదు..ఓడిపోయి చూడు.. ఈ లోకం విలువ తెలుస్తుంది అన్న పెద్దల మాటను గ్రహించలేకపోయారు. సభాపతి ఎంపికలో ప్రతిపక్ష నేత ప్రాధాన్యతను తనకు తానుగా తగ్గించేసుకున్నారు జగన్. వాస్తవానికి జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయినా సరే తొలి రోజు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రుల కాన్వాయ్ తో సమానంగా శాసనసభలోకి ప్రవేశం కల్పించారు. జగన్ హౌస్ లో అడుగుపెట్టిన సమయంలో సైతం మూడు పార్టీల ఎమ్మెల్యేలు సంయమనం పాటించారు. అటు స్పీకర్ ఎంపిక తర్వాత ఆయన విచక్షణాధికారంతో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కేవలం హౌస్ లో అడుగుపెట్టకూడదన్న ఆలోచనతో జగన్ రెండో రోజు సభలకు బాయ్ కట్ చేశారు. ప్రజల వాయిస్ ను వినిపించేందుకు తనకున్న అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇది ముమ్మాటికి ఆయన వైఫల్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు జగన్ కు మధ్య ఉన్న తేడాను గుర్తు చేస్తున్నారు. ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. కానీ జగన్ మాత్రం చేజేతులా అవకాశం ఇస్తున్నారు. ప్రజల్లో చులకన అవుతున్నారు.