War 2: వార్ 2 లో నటిస్తున్న ఎన్టీయార్ ఫేవరెట్ హీరోయిన్…

ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కీలకపాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మాధురి దీక్షిత్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతుందట.

Written By: Gopi, Updated On : June 23, 2024 8:59 am

War 2

Follow us on

War 2: ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని తొందర్లోనే ఫినిష్ చేసి చాలా తొందరగా రిలీజ్ చేయాలని అటు ఎన్టీఆర్, ఇటు హృతిక్ రోషన్ ఇద్దరు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక సినిమా కోసం ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేశాడు. ఇక మరొక షెడ్యూల్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ గ్యాప్ లోనే దేవర సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ షూట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. కాబట్టి షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇక ఫ్రీ గా తను ఓపెన్ మైండ్ తో వర్క్ చేస్తు సినిమా షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కీలకపాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మాధురి దీక్షిత్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతుందట. ఇక మాధురి దీక్షిత్ కి ఎన్టీఆర్ కి మధ్య కొన్ని సీన్లు కూడా ఉండబోతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ కి మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమట.

ఆయన అప్పట్లో ఆమె సినిమాలు ఎక్కువగా చూసేవాడట. ఇక ఇప్పుడు తనతో పాటు కలిసి నటించడం అనేది ఆయనకు చాలా సంతోషమని సినిమా యూనిట్ తో కూడా పలు సందర్భాల్లో చెప్పారట. అయితే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ మాధురి దీక్షిత్ పైన కొన్ని సీన్స్ చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది…