Homeఆంధ్రప్రదేశ్‌Jagan Rappa Viral Dialogue: జగన్ ‘రప్ప‌.. రప్ప’ డైలాగ్.. నేషనల్ లెవల్ ట్రెండింగ్

Jagan Rappa Viral Dialogue: జగన్ ‘రప్ప‌.. రప్ప’ డైలాగ్.. నేషనల్ లెవల్ ట్రెండింగ్

Jagan Rappa Viral Dialogue: ఇటీవల పుష్ప -2 సినిమా విడుదలైన తర్వాత అది ఎంతటి సంచలనం సృష్టించిందో.. అంతే స్థాయిలో వివాదానికి కారణమైంది. పైగా పుష్ప -2 సినిమా సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు రాజకీయంగా కూడా చర్చకు దారితీసాయి. చివరికి అల్లు అర్జున్ కటకటాల పాలు కావలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన విడుదలైనప్పటికీ.. ఆయన కొద్ది రోజుల వరకు బయటకు రాలేదు. ఇక ఇటీవల కాలంలో గద్దర్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సమయంలో అల్లు అర్జున్ జై తెలంగాణ అని నినాదం చేయడం.. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారికి.. అని సంప్రదించడం చర్చకు దారి తీశాయి. అయితే ఇప్పుడు పుష్ప సినిమాతో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా జాతీయ మీడియాలో సంచలనంగా మారిపోయారు. జాతీయ మీడియా వైసిపి అధినేత చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రసారం చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోలను వైసీపీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

Also Read: Jagan Rappa Rappa Viral Video: ‘రప్పా..రప్పా’ అంటూ ‘పుష్ప’ డైలాగ్ కొట్టిన మాజీ సీఎం జగన్..వీడియో వైరల్!

రప్ప రప్ప.. డైలాగ్
ఇటీవల కాలంలో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో ప్రజాదరణ పొందిన సినిమాలలో డైలాగులు సోషల్ మీడియాలో తెగ దర్శనమిచ్చాయి. అయితే సినిమా విడుదలై.. చాలా రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఓ సినిమాలోని లోని కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రధాన మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు జాతీయ మీడియా కూడా అదే డైలాగు ఆధారంగా కథనాలను ప్రసారం చేస్తోంది . ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకటించారు. కార్యకర్త చనిపోతే అతని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అతని కుటుంబాన్ని పరామర్శించారు.. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఓ సినిమాలోని రప్ప రప్ప డైలాగును ఉద్దేశిస్తూ ఓ ఫ్ల కార్డు ప్రదర్శించాడు.

ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటన తర్వాత మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు రప్ప రప్ప డైలాగ్ ను ప్రస్తావించగా.. దానిని వైసిపి అధినేత సమర్థించారు. అధికారంలోకి వస్తే అదే జరుగుతుంది అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. దీనిని టిడిపి అనుకూల మీడియా వ్యతిరేకించగా.. వైసీపీ అనుకూల మీడియా మాత్రం తెగ ప్రచారం చేసింది. ఇక జాతీయ మీడియాలో కూడా దీనిపై ప్రత్యేకంగా కథనాలు ప్రసారం కావడం విశేషం. వీటిని వైసిపి శ్రేణులు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version