Jagan Mohan Reddy : జగన్( Y S Jagan Mohan Reddy ) తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు? తరువాత స్థానం ఎవరిది? నెంబర్ 2 స్థానం భర్తీ చేసేది ఎవరు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. త్వరలో జగన్ అరెస్ట్ అవుతారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమయంలో జగన్ లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపిస్తారు? అంతటి సమర్ధుడు ఎవరు? అంటే మాత్రం అందరి చూపు సీనియర్ నేత బొత్స పై పడుతోంది. ప్రస్తుతం సీనియర్లలో యాక్టివ్ గా ఉన్నారు బొత్స. పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారితో పోల్చుకుంటే బొత్స విభిన్న తీరు.
Also Read : పరిస్థితి మారుతోంది.. బెంగళూరులో జగన్.. లాయర్లతో భేటీ!
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) సీనియర్ నేత. ఉమ్మడి రాష్ట్రంలోనే తనకంటూ ప్రభావం చూపిన నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే రాణించారు. విజయనగరం తో పాటు ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఒకానొక దశలో ఆయన సీఎం రేసులోకి కూడా వచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు అయిన బొత్స సత్యనారాయణ ఆలస్యంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇతర సీనియర్లకు భిన్నంగా బొత్స విషయంలో ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నారు. పదవులతోపాటు గౌరవం విషయంలో ఎక్కడా బొత్సను తగ్గించడం లేదు. శాసనమండలిలో విపక్ష నేతగా క్యాబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చారు. రాజకీయ నిర్ణయాల్లో సైతం బొత్సకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
* సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నా..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) నుంచి అనంతపురం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కానీ కూటమి దూకుడుకు చాలామంది భయపడిపోతున్నారు. రాజకీయాల నుంచి సైడ్ అయిపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం పెద్దగా యాక్టివ్ గా పని చేయడం లేదు. అయితే ఒక్క బొత్స విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆయనపై కూటమి ప్రభుత్వం ఎటువంటి కేసులు నమోదు చేయడం లేదు. బొత్స మాత్రం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇతర నేతలు మాదిరిగా అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు లేవు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం విధానపరంగా మాట్లాడారు బొత్స. హుందాగా వ్యవహరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఆయనను టచ్ చేయడం లేదని తెలుస్తోంది.
Also Read : వైసిపి కమ్మ నేతల ఫుల్ సైలెన్స్.. కారణం అదే!
* అందరి చూపు బొత్స వైపు
అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో( liquor scam ) జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో నెంబర్ 2 ఎవరు? అనే చర్చ వస్తుంటే బొత్స అని ఎక్కువ మంది సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు ఎవరు సన్నిహితంగా లేరు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అంత సమర్ధుడు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి పై వ్యతిరేక భావన ఉంది. విజయసాయిరెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయితే మాత్రం పార్టీ బాధ్యతలు బొత్స పై పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.