YCP Kamma Leaders: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కమ్మ నేతలు సైలెంట్ అయ్యారా? లేకుంటే వారిని సైలెంట్ చేశారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ నేతలు టార్గెట్ అయ్యారు. ప్రధానంగా పోసాని కృష్ణ మురళి కొద్ది రోజులపాటు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ జైల్లోనే ఉన్నారు. వంద రోజులుగా రిమాండ్ ఖైదీ గానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. ఇంకోవైపు మాజీ మంత్రి కొడాలి నాని సైతం అనారోగ్యం పాలయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియదు. అయితే ఈ నేతలంతా ఇబ్బందులు పడుతుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చాలామంది కమ్మ నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వారిపై సామాజిక వర్గ పరంగా ఒత్తిడి ఉందని.. అందుకే మాట్లాడడం లేదని తెలుస్తోంది. కమ్మ నేతల వ్యూహాత్మక మౌనంతో గుంటూరు తో పాటు కృష్ణా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది.
Also Read: ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!
* పదుల సంఖ్యలో నేతలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని( Kodali Nani), లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీ మోహన్, దేవినేని అవినాష్, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు వంటి కమ్మ నేతలు చాలా యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఇందులో కొందరు ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు ఎన్నికల అనంతరం రాజీనామా చేశారు. అయితే పార్టీలో కొనసాగుతున్న కమ్మ నేతలు సైతం ఫుల్ సైలెంట్ కావడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. అసలు వారు పార్టీలో ఉన్నారా? లేరా? అనే పరిస్థితికి చేరుకుంది.
* ఆ కమ్మ నేతలకు జగన్ అవకాశం
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. అయితే అధికార పార్టీకి ధీటుగా 67 అసెంబ్లీ సీట్లతో మంచి ఫలితాలే సాధించింది. ఐదేళ్లపాటు అప్పటి టిడిపి ప్రభుత్వం పై గట్టిగానే పోరాటం చేశారు జగన్ మోహన్ రెడ్డి. సాధారణంగా టిడిపి అంటే కమ్మ సామాజిక వర్గం అభిమానం ఎక్కువ. అయితే అదే సామాజిక వర్గంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పదుల సంఖ్యలో కమ్మ సామాజిక వర్గం నేతలను చేరదీశారు. టిడిపిలో అవకాశం దక్కని నేతలను పిలిచి మరి టిక్కెట్లు ఇచ్చారు. అటువంటి వారంతా 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో గెలిచారు. ఐదేళ్లపాటు పదవిని ఎంజాయ్ చేశారు. అయితే చాలామంది నేతలు ఎన్నికలకు ముందు కూటమి పార్టీలో చేరి పోయారు. అవకాశం లేని కమ్మ నేతలు వైసీపీలోనే ఉండిపోయారు.
* వారి అరెస్టులతో జాగ్రత్తలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ముందుగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ఆయనకు రిమాండ్ మీద రిమాండ్ కొనసాగుతూ వచ్చింది. చివరకు కండిషన్ బెయిల్ తో ఆయన బయటపడ్డారు. ఇప్పుడు వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ కొనసాగుతోంది. ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు. ఇటువంటి తరుణంలో వైసీపీలో ఉన్న కమ్మనేతల జాడ కనిపించకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. కనీసం వారి ఉలుకు పలుకు లేదు. అయితే కమ్మ సామాజిక వర్గ నేతల ప్రభావంతోనే వారు మాట్లాడటం లేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఫుల్ సైలెన్స్ పాటించి.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు వారు డిసైడ్ అయినట్లు సమాచారం.