Jagan Mohan Reddy Avoids Sunitha: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) కేసుల బెంగ వెంటాడుతోంది. గత ఆరేళ్లుగా అక్రమాస్తుల కేసుల్లో ఆయన రిలాక్స్ గా ఉన్నారు. కోర్టు హాజరు విషయంలో మినహాయింపు పొందారు. కానీ ఇప్పుడు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే వైసిపి నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దర్యాప్తులు జరుగుతున్నాయి. వరుసగా వైసీపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తిరుమల లడ్డు కల్తీ కేసు, పరకామణి కేసు, కల్తీ మద్యం కేసు, మద్యం కుంభకోణం కేసు.. ఇలా వరుస కేసులతో వైసిపి నేతలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానంలోనే ఒక ఆసక్తికర పరిణామం ఎదురైంది.
Also Read:జనం వస్తే…జగన్ కోర్టుకు వెళ్లాల్సిన పనిలే!
వివేకానంద రెడ్డి హత్య కేసు..
వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy) హత్య కేసు విషయంలో నాంపల్లి కోర్టులో కుమార్తె సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ పూర్తి చేసినట్లు సుప్రీం కోర్టుకు నివేదించిన నేపథ్యంలో సునీత రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో సిబిఐ విచారణ సవ్యంగా సాగలేదని.. చాలామంది అనుమానితులను విచారించాల్సి ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో కలుగజేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విచారణ మళ్లీ ప్రారంభించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో సునీత రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆమె ఆ పని మీదే ఉన్నారు.
Also Read: జగన్ వస్తే జనం ఉండాల్సిందేనా?
సిబిఐ కోర్టులో..
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా కోర్టు లో హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ( CBI Court) ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు కావాలని జగన్ కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వచ్చారు. అయితే తన తండ్రి హత్య కేసు విచారణకు సంబంధించిన అంశాలతో సునీత రెడ్డి సైతం సీబీఐ కోర్టుకు వచ్చారు. అయితే సునీతా రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి ఎదురుపడ్డారట. కానీ కనీసం పలకరించలేదట. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రదారులతోపాటు సూత్రధారుల సంగతి తేల్చాలని సునీతా రెడ్డి కోరుతూ వచ్చారు. ఈ కేసు వెనక్కి తీసుకోవాల్సిన విషయంలో సునీత రెడ్డి పై ఒత్తిడి ఉంది. పైగా వైసీపీ హయాంలో నిర్వీర్యం కావడంపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే ఏది ఎలా ఉన్నా ఎదురుపడిన సోదరిని జగన్మోహన్ రెడ్డి పలకరించకపోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.