Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ.. శీతాకాలం వచ్చిందంటే.. విపరీతమైన గాలి కాలుష్యం ప్రాణాంతకంగా మారుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఢిల్లీలో మూడు కోట్లకు పైగా వాహనాలు సంచరిస్తున్నాయి. వాటి నుంచి నిరంతరం వెలువడే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణ నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ, పాత వాహనాల వినియోగం ఈ సమస్యను మరింత తీవ్రముగా మారుస్తున్నాయి.
పారిశ్రామిక, నిర్మాణాల నుంచి..
ఎన్‌సీఆర్ పరిసరాల్లో ఉన్న విపరీతమైన ఇండస్ట్రియల్ క్లస్టర్లు, సిమెంట్–ఇటుక పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల వల్ల సన్నని ధూళికణాలు నిరంతరం గాలిలో తేలుతుంటాయి. రెగ్యులేషన్ సడలింపు, పర్యవేక్షణ లోపం వల్ల ఈ ఉద్గారాలు అదుపులోకి రావడం లేదు.
పంఆబ్, హరియాణా నుంచి పొగ..
ప్రతి సంవత్సరం పంట కోతల అనంతరం పంజాబ్, హరియాణా రైతులు పంట అవశేషాలను తగలబెట్టడం ప్రధాన కారణాల్లో ఒకటి. సీజనల్ ఫైర్లు నుంచి ఉద్భవించే పొగ ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తంది. కాలుష్య సాంద్రతను పెంచుతుంది. వాతావరణ మార్పు దిశల మార్పుతో ఈ పొగ గాలిలో నిలిచిపోతుంది.
భౌగోళిక పరిమితులు
ఢిల్లీకి ఉత్తర–తూర్పున హిమాలయ శ్రేణులు, మరోవైపు ఆరావళి పర్వతాలు వాతావరణ చలనం అడ్డుకుంటాయి. గాలి స్థిరంగా ఉండటంతో నగరపు పొగ, ఉద్గార వాయువులు బయటకు వెళ్లలేక గాలి నాణ్యత మరింత దిగజారుతుంది. ప్రభుత్వ చర్యలతోపాటు ప్రజల అవగాహన అత్యవసరం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం, పచ్చదనం పెంపు, పంట వ్యర్థాల సంస్కరణ పద్ధతుల ప్రోత్సాహం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక ఉపశమనం సాధ్యం. తీర్మానాలు కాగితం మీదే కాక అమలు చేయడం పెద్ద సవాల్.