YS Jagan receives secret officer letter: వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Y S Jagan Mohan Reddy ) అజ్ఞాత అధికారి లేఖ రాసినట్లు సమాచారం. కొన్ని రకాల జాగ్రత్తలతో పాటు మరి కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. సదరు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కీలక అధికారిక కూడా వ్యవహరించారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన అధికారి అని కూడా ఒక ప్రచారం ఉంది. ఎక్కడా తన పేరు రాయకుండా జాగ్రత్త పడిన సదరు అధికారి జగన్మోహన్ రెడ్డిని కొన్ని హెచ్చరికలతో కూడిన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అంతర్గత చర్చ కూడా దీనిపైనే పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయే రాజకీయ ఇబ్బందులు, పార్టీ పరంగా పనితీరు మెరుగు పరుచుకోకపోతే వచ్చే ఇక్కట్లు గురించి హెచ్చరించినట్లు సమాచారం.
ఉత్తర కొరియా అధ్యక్షుడు మాదిరిగా
ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో పలుచన చేసేందుకు ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్లు సదరు అధికారి ఆ లెక్కలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొరియా అధ్యక్షుడు కీమ్ మాదిరిగా ప్రజల్లో చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు సదరు అధికారి జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. చేసింది చెప్పుకోలేకపోయామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం.
Also Read: జగన్ కు చేటు తెస్తున్న రోజా కామెంట్స్!
కీలక సూచనలతో పాటు హెచ్చరికలు..
క్షేత్రస్థాయిలో పార్టీ ఆశించిన స్థాయిలో బలపడకపోవడం.. పార్టీ కార్యక్రమాలు విస్తృతం కాకపోవడానికి కూడా సదరు అధికారి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో నాయకత్వంలోటు ఉందని.. ముందు దానిని భర్తీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో వారు పనిచేసే పరిస్థితి ఉండదని కూడా చెప్పినట్లు సమాచారం. ఇంకో వైపు టీటీడీ లడ్డు వివాదం, మద్యం కుంభకోణం పై ఎంత తక్కువ మాట్లాడితే అంత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సొంత సామాజిక వర్గానికి చెందిన సదరు అధికారిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన అధికారిగా మరో అనుమానం. అయితే ఎంత నిజం ఉందో తెలియాలి.
