spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mavigan Capital Controversy: జగన్ 'మావిగన్' స్క్రిప్ట్ రాసిచ్చిందెవరు

YS Jagan Mavigan Capital Controversy: జగన్ ‘మావిగన్’ స్క్రిప్ట్ రాసిచ్చిందెవరు

YS Jagan Mavigan Capital Controversy: జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధాని ప్రతిపాదన పై సొంత వారే విమర్శించడం ప్రారంభించారు. ఆ పార్టీకి ఇప్పటివరకు అనుకూలంగా వ్యవహరించిన చాలామంది విశ్లేషకులు ఉన్నారు. అందులో ఒకరు కేఎస్ ప్రసాద్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల విశ్లేషకుడిగా ముద్రపడ్డారు. ఇప్పుడు జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదన పైకేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చుట్టూ ఉండే వాతావరణం.. జగన్మోహన్ రెడ్డికి ఎలా తప్పు దోవ పట్టిస్తారో చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై కూడా ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యం వేస్తోంది.

Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

* సోషల్ మీడియాలో టార్గెట్..
జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదన చేసిన నాటి నుంచి ఆయన సోషల్ మీడియాలో టార్గెట్ అవుతున్నారు. కామెడీ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు కొందరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వర్గాల వారు దీనిని వ్యతిరేకించలేక తలలు పట్టుకుంటున్నారు. మనవాడికి ఎవడు ఇచ్చాడో స్క్రిప్ట్ అంటూ తిట్టుకుంటున్నారు. కె ఎస్ ప్రసాద్ సైతం అదే తరహాలో స్పందించారు. చుట్టూ దరిద్రులు ఉంటారంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు. వారిచ్చిన స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి చదివేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కె ఎస్ ప్రసాద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటి ఎన్నికల ఫలితాల సరళి గురించి సాక్షి మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన కేఎస్ ప్రసాద్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని.. జగన్ ప్రమాణస్వీకారం చేసేందుకు రెడీగా ఉన్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ఇంటర్వ్యూలలో కూటమికి వ్యతిరేకంగా హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనను తప్పుపడుతున్నారు.

* సజ్జలపై కామెంట్స్..
కేఎస్ ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల విశ్లేషణలు చేసిన క్రమంలో… టిడిపి కూటమికి టార్గెట్ అవుతుంటారు.. మరోవైపు కేసు ప్రసాద్ మాటలు చూస్తుంటే ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి పై కోపం ఉన్నట్టు కనిపిస్తోంది. పక్కన స్క్రిప్టు రాసి ఇచ్చే వాడికి బుద్ధి ఉండాలి అన్నట్టు మాట్లాడారు. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా అయితే జగన్మోహన్ రెడ్డికి కష్టం అన్నట్టు ఆయన మాట్లాడారు. అయితే ఒక్క కేఎస్ ప్రసాద్ మాత్రమే కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సైతం ఈ మావిగన్ ప్రతిపాదనపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధానుల అంశాన్ని ముగించకుండా ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఆగ్రహంతో ఉన్నారు. కానీ కె ఎస్ ప్రసాద్ లాంటి విశ్లేషకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టులపై మాట్లాడుతుండడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version