nara devansh youtube channel : చంద్రబాబు కుటుంబంలో ఏది జరిగిన ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణే. ఇప్పటివరకు చంద్రబాబు.. తరువాత లోకేష్.. ఇప్పుడు దేవాన్ష్ అన్నట్టు పరిస్థితి మారింది. చదువుతో పాటు ఇతరత్రా అంశాల్లో సైతం ముందున్నారు దేవాన్ష్. మొన్నటి వరకు చదరంగంలో సైతం సత్తా చాటారు. ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని నైపుణ్యం కనబరిచారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దేవాన్ష్. ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. పురాతన జంతువులతో పాటు అంశాలను తనదైన శైలిలో వివరించేందుకు సిద్ధపడ్డారు. యూట్యూబ్ ఛానల్ పరిచయ కార్యక్రమంలో భాగంగా కుమారుడు దేవాన్సుతో పాటు లోకేష్ పాలుపంచుకున్నారు. ప్రోమో వీడియోలో లోకేష్ సైతం కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* ముద్దుల మనవడు
నారాతోపాటు నందమూరి కుటుంబానికి సైతం దేవాన్స్ స్పెషల్. నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని లోకేష్ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు పెద్ద మనవడు దేవాన్ష్. బాలకృష్ణకు ఏకైక కుమారుడు లోకేష్ కావడంతో.. దేవాన్ష్ సైతం ఏకైక కుమారుడు లోకేష్ దంపతులకు. అయితే చిన్ననాటి నుంచి నానమ్మ భువనేశ్వరి పర్యవేక్షణలోనే పెరుగుతున్నాడు. ఏటా సంక్రాంతి వేడుకల సమయంలో నారావారిపల్లిలో సైతం దేవాన్స్ సందడి చేస్తుంటాడు. గ్రామానికి వెళ్ళిన క్రమంలో తోటి చిన్నారులతో ఆటలాడుతుంటాడు. కర్ర సాములో సైతం ప్రావీణ్యం పొందాడు. ముఖ్యంగా చెస్ లో రాణిస్తూ వచ్చాడు. ప్రపంచ స్థాయి పోటీల్లో సైతం పాల్గొంటూ వచ్చాడు. ఇప్పుడు కేవలం పరిశోధనాత్మకమైన, ప్రాచీనమైన డైనోసార్లు, ఇతరత్రా జంతువుల గురించి తనకు తెలిసిన విషయాన్ని పంచుకునేందుకు డినోడిట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి వస్తున్నాడు.
* భారీగా ఆదరణ..
కచ్చితంగా ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక మంత్రి కుమారుడు, ప్రముఖ హీరో మనవడు, సెలబ్రిటీ హోదాలో ఇప్పుడు దేవాన్సు యూట్యూబ్ ద్వారా పరిచయం అవుతుండడం మాత్రం గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఎంచుకునేందుకు సినిమా రంగంతో పాటు రాజకీయరంగం ఎలానూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం దేవాన్ష్ విషయంలో అడుగులు వేస్తోంది నారా కుటుంబం. ఈ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్స్ కు లక్షల్లో అప్పుడే వ్యూయర్ షిప్ వస్తోంది. మున్ముందు కచ్చితంగా ఇది సంచలనాలకు వేదిక కానుంది. ఎక్కువమంది నారా దేవాన్సు కు శుభాకాంక్షలు చెబుతున్నారు.