Jagan is suspicious of Sajjala: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదా? ఆయనకు అండగా నిలిచేది ఎవరు? విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయారు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లారు. వై వి సుబ్బారెడ్డి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పుడు ఉన్నదంతా ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన తప్ప జగన్ కు మరో ఆప్షన్ లేదు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఫుల్ జోష్ తో ఉన్నారు. జగన్ జైలుకు వెళ్లినా తాను పార్టీని నడిపించగలనన్న ధీమాతో ఉన్నారు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డిలో అనుమానాలు పెరిగినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షానికి మారి కూడా అనవసరంగా సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్మి మోసపోయానంటూ జగన్ ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కూటమిని తిప్పి కొట్టడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయినట్లు జగన్ అనుమానిస్తున్నారు. సజ్జల ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని జగన్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బిగుసుకుంటున్న మద్యం కుంభకోణం..
మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ప్రచారం నడుస్తోంది. అయితే తొలుత సజ్జల రామకృష్ణారెడ్డి మూలంగానే ఈ కేసును చాలా తేలిగ్గా తీసుకున్నారు. అసలు ఈ కేసు నిలబడదు అని కూడా తేల్చి చెప్పారు. ఇదంతా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదే అన్నట్టు మాట్లాడారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చూస్తుంటే మాత్రం మతి పోతుంది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు? దీని వెనుక ఉన్నది ఎవరు? అన్న వివరాలను సమగ్రంగా సేకరించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టుతో జగన్మోహన్ రెడ్డికి అసలు బొమ్మ కనిపించింది. ఆపై తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు అరెస్టుతో మైండ్ బ్లాక్ అయింది. సిట్ చాలా లోతుగా వెళుతుందని అర్థమైంది. అదే సమయంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది అని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. కానీ చేతిలో మీడియాతో పాటు డిజిటల్ మీడియాను పెడితే కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పి కొట్టలేకపోయారన్న అనుమానం జగన్మోహన్ రెడ్డి లో ఉంది. అందుకే ఇకనుంచి సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆధారపడకుండా.. తానే ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
బెంగళూరు నుంచి లాబీయింగ్..
వారంలో మూడు రోజులపాటు తాడేపల్లికి( Tadepalli ) వచ్చే అలవాటు ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇదే జరుగుతోంది. కానీ ఈ వారం తాడేపల్లి పాలెస్ వైపు చూడలేదు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆధారపడితే తన గొయ్యి తాను తవ్వుకోవాల్సినట్టేనని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మద్యం కుంభకోణం లో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకుని సమయాన్ని వృధా చేశానని.. తన సన్నిహితులు వద్ద జగన్ బాధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు తన చుట్టూ ఉన్న వారిని సజ్జల రామకృష్ణారెడ్డి దూరం చేశారన్న అనుమానం కూడా జగన్లో బలపడుతున్నట్లు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డిని అలా సైడ్ చేసి..
విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ( sajjala Ramakrishna Reddy) అని ఒక ఆరోపణ ఉంది. వైసిపి తో పాటు ప్రభుత్వంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. ఆ అవమాన భారంతోనే విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఉంటే కేంద్రంతో లాబీయింగ్ చేసి ఈ గండం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేసి ఉండేవారని జగన్ గుర్తు చేసుకున్నట్లు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకుని విజయసాయిరెడ్డిని వదులుకున్నాను అన్న బాధ ఆయనలో వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.