Jagan: ఫోబియా( phobia).. అదే తెలుగులో ఆత్మనూన్యాతాభావం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఇది పుష్కలంగా ఉన్నట్టు ఉంది. ఆయన ఒక వలయంలో చిక్కుకొని ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తాను బయటకు వస్తే జనం భారీగా రావాలని కోరుకోవడం ఒకటి. అధికారంలో ఉన్న లేకపోయినా జనం తనను ఆదరిస్తున్నారని చెప్పుకోవడం మరొకటి. కానీ ఈ ప్రయత్నంలో ఆయన పలుచన అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు భారీగా జన సమీకరణ చేసేవారు. జగన్ జనంలోకి వస్తే.. జనమంత ఇళ్లల్లోనే ఉండాలి. లేకుంటే ఆయన సభకు హాజరు కావాలి. ఒకవైపు ఇళ్ల బయట పరదాలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఇంకోవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. తన సభలకు రావాలని బలవంతం పెడతారు. అయితే అవి ఆయనకు మైనస్ గా మారాయి. కూటమి ప్రభుత్వం దానిని ప్లస్లుగా మార్చుకుంది.
* గతానికి భిన్నంగా..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. భారీ సభలు,సమావేశాలు తక్కువే. ప్రతినెల చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు. కానీ జన సమీకరణ లేదు. జనాలు తేవాలన్న ఒత్తిడి యంత్రాంగంపై లేదు. ఆర్టీసీ బస్సుల బలవంతపు ప్రయోగం లేదు. మహిళలను తరలించాలని వెలుగు శాఖపై ఒత్తిడి లేదు. అధికారంలో ఉన్న వారే సింపుల్ గా ప్రజల మధ్యకు వచ్చి వెళ్ళిపోతుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ జనం ఉండాలని కోరుకుంటున్నారు. అలా జనం వస్తేనే తను జననేత అవుతానని భావిస్తున్నారు. అందుకే జగన్ బయటకు అడుగుపెడితే చాలు జనం రావాల్సిందేనన్న స్థితిలో ఉన్నారు.
* ఆ అభిప్రాయం బలంగా..
అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లో ( Y S Jagan Mohan Reddy )ఒక అభిప్రాయం బలంగా నాటుకు పోయింది. తాను బయటకు వస్తే జనం రాకపోతే తన బలం తగ్గిపోయిందని.. వస్తే స్థిరంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనన్న ధీమా ఆయనలో ఉంటుంది. బహుశా ఆ ఫోబియా తోనే ఆయన విపత్తుల సమయంలో బయటకు వచ్చినా.. ఎవరినైనా పరామర్శించేందుకు వచ్చినా జనం భారీగా రావాలని కోరుకుంటారు. సెంటిమెంటల్ ఎమోషన్స్ సీన్స్ క్రియేట్ కావాలని కోరుకుంటారు. కానీ అది ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేక ప్రచారానికి కారణమవుతోంది. కొంచెం అతి చేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ మౌనంగా తన పని తాను చేసుకుని పోతుంటే.. ప్రతిదీ జనంతో చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన మాత్రం ప్రతికూలత చూపుతోంది.