Jagan: హైదరాబాద్ వచ్చారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్( Akhilesh Yadav). సీఎం రేవంత్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. అఖిల భారత యాదవ మహాసభలకు వచ్చిన ఆయన ఆ రాష్ట్ర సీఎంతో పాటు విపక్షానికి చెందిన నేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మర్యాదపూర్వకంగానే ఈ సమావేశాలు జరిగాయి. కానీ ఏపీకి ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా జాతీయస్థాయి నేత రావడం లేదు. అయితే అధికారపక్షం తరపున కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఇదే అఖిలేష్ యాదవ్ గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆందోళన చేసినప్పుడు వచ్చారు. దీంతో అఖిలేష్ యాదవ్ తో జగన్ మైత్రి కొనసాగుతుందని అంతా భావించారు. కానీ తర్వాత ఎందుకో అఖిలేష్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అనుకున్న స్థాయిలో స్నేహం మాత్రం కొనసాగించడం లేదు.
* సరైన స్నేహితులు ఏరి?
జాతీయస్థాయిలో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party) సరైన స్నేహితులు లేరు. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే గడుపుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారంలో నాలుగు రోజులు పాటు అక్కడకే వెళ్తున్నారు. తాడేపల్లి లో మూడు రోజులు పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా ఇక్కడ. అయితే బెంగళూరులో కాంగ్రెస్ ఉండడంతో సేఫ్ జోన్ గా భావించి ఇక్కడ ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో సైతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ రేవంత్ సీఎం గా ఉన్నారు. ఆయన చంద్రబాబు మనిషి అన్న అభిప్రాయం జగన్మోహన్రెడ్డి లో ఉంది. అందుకే పెద్దగా ఇష్టపడడం లేదు.
* వారు సిద్ధంగా ఉన్నా..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) విషయంలో జాతీయస్థాయి నేతల వైఖరి వేరేలా ఉంది. ఆయన పెద్దగా ఇతర పార్టీలతో స్నేహం చేయరు. అయితే ఆయనకు స్నేహ హస్తం అందించేందుకు అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, తేజస్వి యాదవ్, ఉద్దవ్ ఠాక్రె, నవీన్ పట్నాయక్ లాంటి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ వారితో జగన్మోహన్ రెడ్డి స్నేహం చేయడం లేదు. కానీ ఈయనను పట్టించుకోని బిజెపి కోసం పరితపిస్తున్నారు. అంటే కేసులకు భయపడే కదా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించారు కానీ.. ఇప్పుడు బిజెపిని ఎదిరించలేకపోతున్నారు. కనీసం స్నేహితులుగా ఉంటాం అనుకుంటున్న ప్రతిపాదనను సైతం పట్టించుకునే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి.