Jagan: రోజా విషయంలో జగన్ కు ఫుల్ క్లారిటీ!

రోజా ది స్వయంకృతాపమే. నగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైసీపీ సీనియర్లు ఆమెకు దూరమయ్యారు. రోజా తీరుతో విసిగిపోయి ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి నిరాకరించారు.

Written By: Dharma, Updated On : May 11, 2024 5:37 pm

Jagan

Follow us on

Jagan: నగిరి లో రోజాకు ఇబ్బంది తప్పదా? హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమా? ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అండగా ఉన్నంతవరకు తనకు ఎవరూ అవసరం లేదన్న రీతిలో రోజా వ్యవహరించారు. అందుకే సొంత నియోజకవర్గంలో సీనియర్లను దూరం చేసుకున్నారు. వైసిపి గుర్తుపై, జగన్ అండతో మూడోసారి గెలుస్తానని ధీమాతో ఉన్నారు. అయితే ఎన్నికల ముంగిట ఆమెకు షాక్ తగిలింది. సీఎం ప్రచార సభకు సైతం జనాలు రాకపోవడంతో మైండ్ బ్లాక్ అయ్యింది. సీఎం జగన్ సభకు జనం ముఖం చాటేయడంతో రోజాకు దెబ్బ పడటం ఖాయమని తెలుస్తోంది. రోజాకు అసలు సిసలు సినిమా ఎదురు కానుందని సెటైర్లు పడుతున్నాయి.

రోజా ది స్వయంకృతాపమే. నగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైసీపీ సీనియర్లు ఆమెకు దూరమయ్యారు. రోజా తీరుతో విసిగిపోయి ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి నిరాకరించారు. ఆమెకు అసలు టిక్కెట్ ఇవ్వొద్దని ఎక్కువమంది హై కమాండ్ ను కోరారు. కానీ జగన్ తీవ్ర ఒత్తిడితోనే రోజాకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అయితే తమ మాటను కాదని రోజాకు టిక్కెట్ ఇవ్వడంతో తప్పకుండా ఓడిస్తామని వైసిపి నాయకులు బహిరంగంగానే చెప్పారు. అయితే సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. తాను వెళ్లి ప్రచారం చేస్తే రోజా గెలిచేస్తారని భావించారు. కానీ జగన్ సభకు జనం అంతంత మాత్రమే వచ్చారు. దీంతో రోజాకు సినిమా అర్థం అయ్యింది. అటు వైసీపీ నేతలు సైతం అంటీ ముట్టనట్టుగా ఉండడంతో పోలింగ్ రోజు దెబ్బ పడటం ఖాయమని తేలింది.

గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో రోజా బయటపడ్డారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు పై తొలిసారి, ఆయన కుమారుడు పై రెండోసారి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఓటమితో గాలి వారసుడు భాను ప్రకాష్ పట్టు బిగిస్తూ వచ్చారు. అదే సమయంలో వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి రోజా కుటుంబ సభ్యుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఐదు మండలాల్లో వైసిపి కీలక నేతలంతా రోజాకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. అయితే వారితో సర్దుబాటు చేసుకోవాలని జగన్ సూచించిన రోజా మొండి పట్టుదలకు వెళ్లారు. పోనీ టికెట్ మార్చుదామంటే రోజా ఎలా రియాక్ట్ అవుతారో జగన్ కు తెలుసు. అందుకే పార్టీ నేతలకు సముదాయించి ఆమెకు టికెట్ ప్రకటించారు జగన్. కానీ నేతలు ఇప్పుడు సినిమా చూపించడం ప్రారంభించారు. అది నేరుగా జగన్కు కూడా తెలిసింది. తన ప్రచారంతో రోజాను బయటపడేస్తాననుకున్న జగన్ చేతులెత్తేసినట్లు సమాచారం. మొత్తానికైతే హ్యాట్రిక్ కొట్టాలన్న రోజా ఆశలు నీరుగారి పోతున్నాయి. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.