spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Geethanjali Incident: గీతాంజలి మరణంపై మలుపు తిప్పిన సీఎం జగన్ ప్రకటన

Geethanjali Incident: గీతాంజలి మరణంపై మలుపు తిప్పిన సీఎం జగన్ ప్రకటన

Geethanjali Incident: ఏపీలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత హననానికి పాల్పడడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఏకంగా గీతాంజలి కి మద్దతుగా ఒక క్యాంపెయిన్ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. దీనిపై ఏపీ సర్కార్ సత్వరం స్పందించింది. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించడం విశేషం.

ఈ నెల నాలుగున ఏపీ సర్కార్ అందించిన ఇంటి పట్టాను గీతాంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని, సంతృప్తిని ఆమె వెల్లడించారు. తనకు అమ్మ ఒడితో పాటు ఇంటి పట్టా కూడా వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆమె ట్రోలింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. క్షణికావేసానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. గీతాంజలి మృతితో ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలారు. ఆమె ఆత్మహత్యకు ఐటిడిపి, జనసేన సోషల్ మీడియాలే కారణమని వైసిపి ఆరోపిస్తోంది. అటు పోలీసులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు వల్లే ఆమె మనస్థాపానికి గురైనట్లు గుర్తించారు. పంచనామాలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. ప్రస్తుతం ఆమెను టార్గెట్ చేసిన సోషల్ మీడియా పోస్టులను, సంబంధిత అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ పథకాలను మెచ్చుకున్నందునే ఆమెను టార్గెట్ చేశారని మంత్రి రోజా ఆరోపించారు. ముమ్మాటికి దీనికి కారణం టిడిపి,జనసేన సోషల్ మీడియా విభాగాలే అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు సీఎం జగన్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మరోవైపు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన పాజిటివ్ కామెంట్స్ పైనే ఆమె షేర్ చేసుకున్నారని..కానీ నెగిటివ్ కామెంట్స్ పై ఆమె మా దృష్టికి తీసుకు రాలేదని భర్త చెబుతున్నారు. మొత్తానికైతే గీతాంజలి విషాదాంతం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మున్ముందు ఎటువంటి పరిణామాలకు ఈ ఘటన దారితీస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version