Homeఆంధ్రప్రదేశ్‌Jagan Condition On Anil Kumar Yadav: జగన్ షరతు.. పార్టీకి దూరంగా ఆ మాజీ...

Jagan Condition On Anil Kumar Yadav: జగన్ షరతు.. పార్టీకి దూరంగా ఆ మాజీ మంత్రి!

Jagan Condition On Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పద నేతలంతా యాక్టివయ్యారు. ఒకే ఒక్కరు తప్ప. ఆయనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయతతో వ్యవహరించే అనిల్ కుమార్ యాదవ్ కొద్దిరోజులుగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాడేపల్లి సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరమవుతారా? లేకుంటే వైసీపీకి దూరమయ్యారా? అన్నది మాత్రం తెలియడం లేదు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ లాంటి వారు కూడా ఆక్టివ్ అయ్యారు కానీ.. అనిల్ జాడ లేకపోవడం నిజంగా చర్చకు దారితీస్తోంది.

రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించిన నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. 2009లో ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రెండోసారి వైసీపీ నుంచి గెలిచిన అనిల్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో మాత్రం నెల్లూరు అసెంబ్లీ సీటు ఇవ్వలేదు. నరసరావుపేట పార్లమెంటు సీటును ఇచ్చారు. టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయారు. అక్కడ నుంచి కనిపించకుండా మానేశారు అనిల్ కుమార్ యాదవ్.

ఆ అసంతృప్తితో..
వైసీపీలో దాదాపు నేతలంతా క్రియాశీలకం అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నెల్లూరులో చిన్న చిన్న ప్రెస్ మీట్ లు పెట్టి జారుకుంటున్నారు. అయితే ఇప్పటికే నెల్లూరు సిటీ బాధ్యతలను ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఆ నిర్ణయం నచ్చక అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వైపు రావడం లేదన్న ప్రచారం ఉంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే నెల్లూరులో తనకు ఎంతో నమ్మకస్తులైన నేతలను వదులుకున్నారు జగన్. ఇప్పుడు కష్టంలో ఉండగా ఈ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా జగన్ పక్కన నిలబడకపోవడం అనేది పొలిటికల్ వర్గాల్లో ఆశ్చర్యం వేస్తోంది. అసలు అనిల్ కుమార్ యాదవ్ తిరిగి యాక్టివ్ అవుతారా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు విషయంలో అనిల్ కు షరతు పెట్టడం వల్లే.. పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version