https://oktelugu.com/

Jagan: ఏపీలో బిజెపికి ఆప్షన్ గా జగన్.. తట్టుకోలేకపోతున్న టిడిపి

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని బిజెపి ఒక ఆప్షన్ గా ఎంచుకుంది. తన రాజకీయం కోసం వాడుకుంటోంది.

Written By: , Updated On : February 20, 2025 / 11:04 AM IST
Jagan (1)

Jagan (1)

Follow us on

Jagan: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తుంటాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ప్రారంభమైంది. తెలుగుదేశం వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి ఉండేది. ఇప్పుడు జనసేన ఎంట్రీ తో సీన్ మరింత మారింది. రాజకీయ ప్రత్యర్థులు అన్నమాట మరిచి రాజకీయ శత్రువులు అన్నట్టు పరిస్థితికి వచ్చింది. పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలకు మించి వ్యక్తిగత వైరం అన్న పరిస్థితికి వచ్చింది. అందుకే శాసనసభకు హాజరు కారు. ఆల్ పార్టీ మీటింగ్స్ ఉండవు. కనీసం పలకరించని పరిస్థితి ఏపీలో కొనసాగుతోంది. అయితే దీనినే అలుసుగా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరు ఎంపీలుగా గెలిచినా.. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 25 మంది ఎంపీలు తమ వారేని అన్నట్టు వ్యవహరిస్తోంది ఎన్డిఏ. దీంతో ఏపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు దక్కడం లేదు. అంతిమంగా ఏపీ ప్రజలు నష్టపోతున్నారు.

* అప్పటినుంచి స్నేహ హస్తమే
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) గెలిచింది. ఎన్డీఏలో చేరింది. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నా.. తెర వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలోని బిజెపి సహకారం అందించింది అన్నది ఒక అనుమానం. ఆ అనుమానంతోనే 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. బిజెపిని దూరం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో అదే బిజెపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ సహకారం అందించింది. 22 పార్లమెంట్ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బిజెపికి కనీస ప్రాతినిధ్యం లేకపోయినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకున్న బలంతో బిజెపికి అండగా నిలిచింది.

* జగన్మోహన్ రెడ్డి పై చర్యలేవి?
అయితే ఇప్పుడు టిడిపి ( TDP)నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. 21 పార్లమెంటు సీట్లతో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యింది ఆంధ్ర ప్రదేశ్. అయితే ఇప్పుడు టిడిపి ఎన్ డి ఏ లో కీలక భాగస్వామి. తన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని అణచివేయాలని కోరుతోంది. కానీ 9 నెలలు అవుతున్న అటువంటి చర్యలు ఏవీ లేవు కేంద్రం నుంచి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అసహనం కనిపిస్తోంది. ఎప్పుడో పదేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. గత ఐదేళ్లలో విచారణకు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా ఆయనకు అదే మినహాయింపు వర్తిస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆప్షన్ గా ఉంచుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. గత పది ఏళ్లలో ఏపీలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది కేంద్రం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగాలంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉనికి ఉండాల్సిందేనని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

* బిజెపికి ప్రత్యేక ప్రయోజనం లేదు
ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డిని అణచివేస్తే చంద్రబాబు( Chandrababu) బలం పెరుగుతుంది. తద్వారా బిజెపికి వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు. రేపు జగన్మోహన్ రెడ్డి బలం పెంచుకున్న.. బిజెపికి తప్పకుండా అండగా నిలుస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎదుట ఇండియా కూటమి అవకాశం ఉన్నా అటువైపు చూడడం లేదు. రేపు జగన్మోహన్ రెడ్డి జనంలో బలం పెంచుకోవచ్చు. అందుకే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి జోలికి కేంద్ర పెద్దలు వెళ్లడం లేదు. మొత్తానికి అయితే ఏపీ రాజకీయాల్లో మున్ముందు జగన్మోహన్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగలడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.