Tandel
Tandel : యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని, అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya),సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్ లో చందు మొండేటి(Chandu Mondeti) దరక్షత్వం లో తెరకెక్కిన ‘తండేల్'(Thandel Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు(Bunny Vasu) సంయుక్తంగా కలిసి నిర్మించారు. ప్రారంభం లో ఈ సినిమా కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇప్పటికీ జనాల్లో అదే టాక్ ఉంది కానీ, పాటలు పెద్ద హిట్ అవ్వడం, అదే విధంగా నాగ చైతన్య నటనకు మంచి రెస్పాన్స్ రావడం తో ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కట్టేసారు. నాగ చైతన్య కి మాత్రమే కాకుండా, అక్కినేని కుటుంబం మొత్తానికి మొట్టమొదటి వంద కోట్ల గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచి సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే థియేటర్స్ లో దిగ్విజయం గా నడుస్తున్న ఈ సినిమాని పైరసీ చాలా పెద్ద దెబ్బ కొట్టింది.
విడుదలైన రెండవ రోజే HD ప్రింట్, డాళ్బీ ఆడియో తో ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేసింది . లోకల్ టీవీ చానెల్స్ తో పాటు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులలో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. నిర్మాతలు పైరసీ ని అడ్డుకునేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా, అడ్డుకోవడం వాళ్ళ వల్ల కాలేదు. ఫలితంగా ఓటీటీ మీద అ ప్రభావం పడింది. థియేటర్స్ లో మంచి వసూళ్లు ఇప్పటికీ వస్తున్నా కూడా, ఓటీటీ లో తొందరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే నెల నాల్గవ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చని సంతకాలు ఇరు పార్టీల మధ్య జరిగాయి. థియేటర్స్ లో బాగా ఆడుతున్న సినిమా కాబట్టి నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తే మరో రెండు వారాలు ఆగుతారు.
‘తండేల్’ కి కూడా నిర్మాతలు అలాగే రిక్వెస్ట్ చేశారట. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ వీళ్ళ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా హై క్వాలిటీ తో ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేసిందని, దాని వల్ల ఓటీటీ లో చూడాలని అనుకున్న ఆడియన్స్ మొత్తం ఆన్లైన్ లో చూసేశారని, మాకు ఇది నష్టం కలిగించే వ్యవహారమని, మీ రిక్వెస్ట్ ని అంగీకరించి రెండు వారాల తర్వాత మేము ఈ సినిమాని విడుదల చేస్తే, ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని, కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలోనూ మార్చి 4 న స్ట్రీమింగ్ మొదలు పెడుతామని చెప్పుకొచ్చారట. నిర్మాతలు కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి కావడం తో వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వచ్చే వారం ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం.