Jabardasth Shanti Swarup: వైయస్ జగన్మోహన్ రెడ్డి ని( Y S Jagan Mohan Reddy ) వ్యతిరేకించే వర్గాలు చాలా ఉన్నాయి. అయితే అందులో బుల్లితెర వర్గం కూడా ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ టీం సభ్యులు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువగా ప్రచారం చేస్తుంటాయి. దానికి కారణం ముమ్మాటికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఆపై చిరంజీవి ఫ్యామిలీ పట్ల ఔత్సాహిక కళాకారులకు చాలా గౌరవం ఉంటుంది. ఆ పై జబర్దస్త్ లో సుదీర్ఘకాలం రాణించారు అంటే నాగబాబు కారణమని ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు. ఈ క్రమంలో జబర్దస్త్ నటులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించడంతో.. ఆ పార్టీ శ్రేణులు కూడా ఆ నటులను వ్యతిరేక కోణంలోనే చూస్తుంటారు. అయితే జబర్దస్త్ టీం లో హైపర్ ఆది, కిరాక్ ఆర్పి వంటి వారు రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కిరాక్ ఆర్ పి అయితే నేరుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్ లో వేసుకుంటారు. మిగతా జబర్దస్త్ నటులు పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారారే తప్ప పొలిటికల్ స్టేట్మెంట్లు ఎప్పుడు చేయరు. తాజాగా జబర్దస్త్ లో లేడీస్ గెటప్ నటుడు శాంతి స్వరూప్ ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఇచ్చి పడేశారు.
* జగన్ విమర్శలు..
ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్( arava Sridhar ) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. రాజకీయంగా కూడా విమర్శలు వచ్చాయి. నేరుగా బాధిత యువతి వీడియోలు విడుదల చేయడం, తనకు శ్రీధర్ అన్యాయం చేశాడని చెప్పడం వంటివి పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఒక్క అరవ శ్రీధర్ పై మాత్రమే కాదు. కూన రవికుమార్, విజయవాడ ఎమ్మెల్యే ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మహిళలతో రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ స్పందించారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడిచిపెట్టారు. అది విపరీతంగా వైరల్ అవుతుంది.
* సంక్రాంతి సంబరాల్లో..
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు( Sankranthi festival ) పెద్ద ఎత్తున జరుగుతాయి. భారీ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ క్రమంలో బుల్లితెర నటుడు హైపర్ ఆది టీం సంక్రాంతి సంబరాలకు గాను వెళ్ళింది. అదే టీమ్ లో జబర్దస్త్ లేడీ గెటప్ నటుడు శాంతి స్వరూప్ కూడా వెళ్లారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంత్రి సుభాష్ ను జబర్దస్త్ టీం డాన్స్ వేయాలని కోరింది. అందుకు ఆయన అంగీకరించలేదు. లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ వెళ్లి రిక్వెస్ట్ చేసేసరికి ఆయన ఒప్పుకున్నారు. రెండు స్టెప్పులు వేశారు. అయితే తాజాగా అరవ శ్రీధర్ వ్యవహారం పై మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారంటూ ఆరోపించారు. మహిళలతో డ్యాన్సులు వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానిపై స్పందించిన శాంతి స్వరూప్ సుతి మెత్తగా జగన్మోహన్ రెడ్డి వైఖరి పై వ్యాఖ్యానాలు చేశారు.
* సోషల్ మీడియాలో పోస్ట్..
తాజాగా ఆమె ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు శాంతి స్వరూప్ ( Shanti Swaroop). సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న మంచి అభిప్రాయం పోయిందన్నట్టు మాట్లాడారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తో డాన్స్ వేసింది తానేనంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేమంతా కోరితేనే మంత్రి సుభాష్ రెండు స్టెప్పులు వేసారని గుర్తు చేశారు. కానీ మహిళలు అంటూ.. రికార్డు డ్యాన్సులు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. తమలాంటి కళాకారుల పొట్ట కొట్ట వద్దని విజ్ఞప్తి చేశారు. తమకోసం మీలాంటి పెద్దవారికి తెలియకపోవచ్చు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన షోలో సైతం పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి పై ఓ జబర్దస్త్ నటుడు అలా విరుచుకు పడడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. సహజంగానే జబర్దస్త్ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనే ముద్ర రోజురోజుకు పెరుగుతోంది.